Crop MSP Hike : అన్నదాతలకు మోదీ సర్కార్ గుడ్‌న్యూస్.. పంటల కనీస మద్దతు ధర పెంపు.. ఏ పంటకు ఎంతంటే?

Crop MSP Hike : 2027-28 మార్కెటింగ్ సీజన్‌కు 6 రబీ పంటల ఎంఎస్పీని కేంద్ర ప్రభుత్వం పెంచింది. పంటల మద్దతు ధర పెంచుతూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. కేబినెట్ కీలక నిర్ణయాలేంటో ఓసారి చూద్దాం..

Crop MSP Hike

  • పంటల మద్దతు ధర పెంచుతూ కేబినెట్‌ నిర్ణయం
  • రబీ పంటల మద్దతు ధర కోసం రూ.90,962 కోట్లు
  • గోధుమల మద్దతు ధర రూ.2,610కు పెంపు
  • క్వింటా శెనగల మద్దతు ధర రూ.5,958కు పెంపు

Crop MSP Hike : రైతులకు భారీ గుడ్ న్యూస్.. పంటల కనీస మద్దతు ధరపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2027-28 మార్కెటింగ్ సీజన్‌కు సంబంధించి 6 రబీ పంటల కనీస మద్దతు ధర (MSP)ను పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయించింది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రబీ పంటల మద్దతు ధరల కోసం రూ.90,962 కోట్లు, ఢిల్లీలో ఐటీఎంఎస్ కోసం రూ.1,790 కోట్లు కేటాయించినట్లు ప్రభుత్వం తెలిపింది.

కొత్త ఎంఎస్పీ ప్రకారం.. గోధుమల ధరను క్వింటాల్‌కు రూ.2,610, శనగల ధరను రూ.5,958, ఎర్ర కందిపప్పు (మసూర్) ధరను రూ.7,390, బార్లీ ధరను రూ.2,286, ఆవాల ధరను రూ.6,613, కుసుమ ధరను రూ.7,215గా నిర్ణయించింది. 6 పంటల్లో కుసుమ MSPను అత్యధికంగా రూ.675 పెంచారు. రాప్‌సీడ్-ఆవాల MSPను రూ.413, మసూర్ పప్పును రూ.390, బార్లీని రూ.136, శనగను రూ.83, గోధుమను రూ.25 చొప్పున పెంచారు.

Read Also : CM Chandrababu : చంద్రబాబు సభ సమీపంలో సిలిండర్ పేలుడు.. ఒక్కసారిగా ఉలిక్కిపడిన పోలీసులు!

కొత్త MSPలతో అఖిల భారత సగటు ఉత్పత్తి వ్యయంపై రైతులకు గణనీయమైన మార్జిన్ లభిస్తుందని తెలిపింది. గోధుమపై 106 శాతం, రాప్‌సీడ్-ఆవాలపై 96 శాతం, మసూర్‌పై 92 శాతం, శనగపై 59 శాతం, బార్లీపై 58 శాతం, కుసుమపై 50 శాతం మార్జిన్ ఉంటుందని అంచనా వేసింది.

2018-19 కేంద్ర బడ్జెట్‌లో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా అఖిల భారత సగటు ఉత్పత్తి వ్యయానికి కనీసం 1.5 రెట్ల స్థాయిలో ఎంఎస్పీ ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. పప్పుధాన్యాలు, నూనెగింజల ఎంఎస్పీ పెంపుతో పంటల వైవిధ్యీకరణకు రైతులను ప్రోత్సహించవచ్చని తెలిపింది.

2014-15 నుంచి 2025-26 మధ్య గోధుమ రైతులకు ఎంఎస్పీ కింద రూ.7.31 లక్షల కోట్లు చెల్లించినట్లు వెల్లడించింది. ఇదే కాలంలో 6 రబీ పంటలకు కలిపి రూ.8.36 లక్షల కోట్లు చెల్లించినట్లు తెలిపింది.