E-Coli In Drinking Water: రైల్వే స్టేషన్ల నీటిలో ‘ఈ-కోలి’ బ్యాక్టీరియా.. కాగ్ షాకింగ్ నివేదిక.. కేంద్రంపై తీవ్ర స్థాయిలో ఫైర్

ప్రముఖ స్టేషన్లలోని కుళాయిల నుంచి సేకరించిన నీటి నమూనాల్లో అనారోగ్యానికి గురిచేసే 'ఈ-కోలి(E-Coli In Drinking Water)', టోటల్ కోలిఫార్మ్స్ బ్యాక్టీరియా ఉన్నట్లు పరీక్షల్లో నిర్ధారణ అయింది.

cag report e coli found in drinking water at railway stations

  • తాగునీటిలో ప్రమాదకర ఈ-కోలి
  • 458 రైల్వేస్టేషన్లలో అధ్వాన సౌకర్యాలు
  • బయటపడ్డ రైల్వే శాఖ నిర్లక్ష్యం

E-Coli In Drinking Water: దేశవ్యాప్తంగా ప్రతినిత్యం లక్షలాది మంది ప్రయాణించే రైల్వే స్టేషన్లలో కనీస మౌలిక సదుపాయాలు దారుణంగా తయారయ్యాయని, ప్రయాణికులకు అందించే తాగునీరు తీవ్ర అసౌకర్యాలకు, ఆరోగ్య సమస్యలకు దారితీస్తోందని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక సంచలన విషయాలను బయటపెట్టింది. ఇటీవల పార్లమెంట్‌కు సమర్పించిన ఈ నివేదిక ప్రకారం, దేశంలోని వందలాది ప్రధాన స్టేషన్లలో పారిశుధ్యం, మంచినీటి సౌకర్యాలు అత్యంత అధ్వానంగా ఉన్నాయని స్పష్టమైంది. అనేక రైల్వే జోన్లు ప్రయాణికుల రక్షణ, పరిశుభ్రత కోసం రూపొందించిన ప్రామాణిక నిబంధనలను పాటించడంలో దారుణంగా విఫలమయ్యాయని కాగ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

BRS Protest: కల్యాణలక్ష్మి రద్దుకు కాంగ్రెస్ కుట్ర.. కేటీఆర్ సంచలన ఆరోపణలు.. నేడు రాష్ట్ర వ్యాప్తంగా భారాస నిరసనలు

తాగునీటి నమూనాల్లో ప్రమాదకర బ్యాక్టీరియా:

కాగ్ అధ్యయనం చేసిన 512 నాన్-సబర్బన్ స్టేషన్లలో దాదాపు 89 శాతానికి పైగా (458 స్టేషన్లు) నిబంధనల కంటే దారుణమైన స్థితిలో ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్, కోయంబత్తూరు, ముంబై ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్, పాలక్కాడ్, కల్యాణ్, లోనావాలా వంటి ప్రముఖ స్టేషన్లలోని వాటర్ కూలర్లు, ప్లాట్‌ఫామ్ కుళాయిల నుంచి సేకరించిన నీటి నమూనాల్లో తీవ్ర అనారోగ్యానికి గురిచేసే ‘ఈ-కోలి(E-Coli In Drinking Water)’, టోటల్ కోలిఫార్మ్స్ బ్యాక్టీరియా ఉన్నట్లు పరీక్షల్లో నిర్ధారణ అయింది.

పరిశుభ్రత లేక అవస్థలు పడుతున్న ప్రయాణికులు:

కేవలం తాగునీరే కాకుండా, స్టేషన్లలోని వాష్‌రూమ్‌లు, ప్లాట్‌ఫామ్‌ల నిర్వహణ కూడా అధ్వానంగా ఉందని కాగ్ పేర్కొంది. 2022-23, 2023-24 సంవత్సరాల్లో వివిధ జోన్లలో నిర్వహించిన తనిఖీల్లో ఈ దిగ్భ్రాంతికర నిజాలు వెలుగులోకి వచ్చాయి. ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి తీవ్ర లోపాలపై తక్షణమే చర్యలు చేపట్టి, స్టేషన్లలో సురక్షితమైన తాగునీటిని అందించాలని రైల్వే శాఖను కాగ్ ఆదేశించింది.