Mumbai: అదృష్టమంటే అతడిడే.. బస్సు కింద పడ్డా బతికిపోయాడు.. వైరల్ వీడియో
ఈ ఘటనకు సంబంధించిన దృశ్యం అక్కడి సీసీ కెమెరాలో రికార్డైంది. ముంబైలోని పోవై ప్రాంతంలోని ఎవరెస్ట్ హైట్స్ బిల్డింగ్ పరిధిలో మంగళవారం జరిగిందీ ఘటన. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
- Narender Thiru
- Published On : December 15, 2022 / 04:08 PM IST
Mumbai: బస్సు కింద పడ్డా అనూహ్యంగా ప్రాణాలతో బయటపడ్డాడు ఒక వృద్ధుడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యం అక్కడి సీసీ కెమెరాలో రికార్డైంది. ముంబైలోని పోవై ప్రాంతంలోని ఎవరెస్ట్ హైట్స్ బిల్డింగ్ పరిధిలో మంగళవారం జరిగిందీ ఘటన. అక్కడి రద్దీగా ఉండే రోడ్డుపై సాయంత్రం పూట వాహనాలు వెళ్తున్నాయి.
Tamil Nadu: ట్రక్కు తాడు మెడకు చుట్టుకుని రోడ్డుపై ఎగిరి పడ్డ బైకర్.. అనూహ్య ఘటన
ఈ క్రమంలో ఒక వృద్ధుడు రోడ్డు దాటేందుకు ప్రయత్నిస్తున్నాడు. అయితే బస్సును గమనించకుండా నడుచుకుంటూ, బస్సుకు అడ్డంగా వెళ్లిపోయాడు. బస్సు డ్రైవర్ కూడా ఇది గమనించలేదు. దీంతో ఆ వృద్ధుడు బస్సు కింద పడిపోయాడు. అది తెలియని డ్రైవర్ బస్సును ముందుకు కదిలించాడు. అది చూసిన చుట్టుపక్కల వాళ్లు బస్సు అతడి మీద నుంచి వెళ్లిందేమో అనుకున్నారు. వెంటనే బస్సు ఆపించారు. డ్రైవర్ ఇది గుర్తించి, బస్సు ఆపేశాడు. అయితే, బస్సు కింద పడ్డ వృద్ధుడు కొద్దిసేపటి తర్వాత మెల్లిగా లేచొచ్చాడు. బస్సు డ్రైవర్ వద్దకు వచ్చి, ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. కొద్దిసేపు బస్సు ఎదురుగా కూర్చుని నిరసన వ్యక్తం చేశాడు.
ఈ ఘటనలో బస్సు కింద పడ్డప్పటికీ, వృద్ధుడు ఎలాంటి గాయాలు కాకుండా సురక్షితంగా బయటపడటం విశేషం. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు అదృష్టమంటే అతడిదే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
#WATCH | Elderly man’s close shave in Powai area of Mumbai. The incident was captured on a CCTV camera.
(Source: viral video) pic.twitter.com/50LV4N2Pvk
— ANI (@ANI) December 15, 2022
