E20 Petrol: E20 పెట్రోల్‌పై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు.. తేల్చి చెప్పిన కేంద్రం

E20 పెట్రోల్‌(E20 Petrol) విషయంలో వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదని, తిరిగి E0 లేదా E10 పెట్రోల్‌కు మారే ఆలోచన కేంద్రానికి లేదని స్పష్టం చేసింది.

Center on e20 petrol policy no rollback clarification in rajya sabha

  • E20 పెట్రోల్‌పై కేంద్రం స్పష్టత
  • ఇంజిన్లకు ఎలాంటి ప్రమాదం లేదు
  • విదేశీ మారక ద్రవ్యం ఆదా

E20 Petrol: దేశంలో ఇంధన దిగుమతుల భారాన్ని తగ్గించడంతో పాటు పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా ప్రవేశపెట్టిన E20 పెట్రోల్ వినియోగంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. E20 పెట్రోల్‌ విషయంలో వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదని, తిరిగి E0 లేదా E10 పెట్రోల్‌కు మారే ఆలోచన కేంద్రానికి లేదని స్పష్టం చేసింది. రాజ్యసభలో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అడిగిన ప్రశ్నకు పెట్రోలియం శాఖ సహాయ మంత్రి సురేశ్‌ గోపి లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. నీతి ఆయోగ్, వాహన తయారీదారులు, ARAI, SIAM వంటి ప్రముఖ సంస్థలతో విస్తృతంగా చర్చించి, శాస్త్రీయంగా ఆమోదించిన తర్వాతే ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చామని కేంద్రం వివరించింది.

TTD: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. ప్రత్యేక దర్శనాలు, ఆర్జిత సేవల రద్దు

పరిపాలనా సవాళ్లు – వాహన మైలేజీపై వివరణ:

దేశంలోని లక్షకు పైగా పెట్రోల్ బంకుల్లో E0, E10, E20 (E20 Petrol)పెట్రోల్‌ను వేర్వేరుగా సరఫరా చేయడం వల్ల తీవ్ర రవాణా సమస్యలు, నిర్వహణ ఖర్చులు పెరుగుతాయని కేంద్రం పేర్కొంది. E10 ఇంజిన్లలో E20 వాడటం వల్ల మైలేజీ 3-5 శాతం తగ్గినప్పటికీ, అధిక ఆక్టేన్ కారణంగా మెరుగైన యాక్సిలరేషన్ లభిస్తుందని తెలిపింది. కర్బన ఉద్గారాలు 30 శాతం వరకు తగ్గుతాయని స్పష్టం చేసింది. దేశంలో 20 కోట్లకు పైగా టూవీలర్లు, 3 కోట్ల కార్లు ఉన్నప్పటికీ, ఈ ఇంధనం వల్ల ఇంజిన్లు పాడైనట్లు ఆధారాలు లేవని, కంపెనీలు వారంటీని కొనసాగిస్తున్నాయని వెల్లడించింది.

ఆర్థిక ప్రయోజనాలు – విదేశీ మారక ద్రవ్య ఆదా:

ఇథనాల్ బ్లెండింగ్ వల్ల దేశానికి ఆర్థికంగా, పర్యావరణపరంగా భారీ ప్రయోజనాలు చేకూరాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటివరకు సుమారు రూ. 1.97 లక్షల కోట్లకు పైగా విదేశీ మారక ద్రవ్యం ఆదా అయిందని తెలిపింది. అంతేకాకుండా, 316 లక్షల మెట్రిక్ టన్నుల ముడి చమురు దిగుమతుల అవసరం తగ్గడమే కాకుండా, 952 లక్షల మెట్రిక్ టన్నుల మేర కర్బన ఉద్గారాలు తగ్గుముఖం పట్టాయని రాజ్యసభకు అందజేసిన వివరాల్లో కేంద్రం పేర్కొంది.