Bhavya scheme : ‘భవ్య’ పథకంకు శ్రీకారం.. ఈ పథకం వల్ల ఉపయోగాలు ఏమిటో తెలుసా? నిరుద్యోగులకూ గుడ్‌న్యూస్..

Bhavya scheme : దేశంలో పారిశ్రామిక ప్రగతికి ఊతం ఇచ్చేందుకు రూ.33,600 కోట్లతో భారత్‌ ఔద్యోగిక్‌ వికాస్‌ యోజన (భవ్య) పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

Central Cabinet approves Rs 33,660 crore BHAVYA scheme 100 plug and play industrial parks to be developed

  • భవ్య పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం
  • వచ్చే ఆరేళ్లలో 100 పారిశ్రామిక పార్కుల అభివృద్ధి
  • ప్రత్యక్షంగా 15లక్షల ఉద్యోగాల సృష్టి

Bhavya scheme : కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. దేశంలో పారిశ్రామిక ప్రగతికి ఊతం ఇచ్చేందుకు రూ.33,600 కోట్ల బడ్జెట్‌తో భారత ఔద్యోగిక్ వికాస్ యోజన (భవ్య) పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

Also Read : AP Govt job calendar : ఏపీలో 10,060 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల.. శాఖల వారిగా పోస్టులు, నోటిఫికేష‌న్ల తేదీలు ఇవే..

అభివృద్ధి ప్రాజెక్టులకు భూసేకరణ ఇబ్బందిగా మారుతున్న తరుణంలో.. ఆ సమస్యకు పరిష్కారంగా కేంద్ర ప్రభుత్వం భవ్య పథకానికి శ్రీకారం చుట్టింది. అదే సమయంలో వచ్చే ఆరేళ్లలో 100 ఇండస్ట్రీయల్ పార్కులను నెలకొల్పాలని టార్గెట్ పెట్టుకోవటం ద్వారా లక్షలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయనుంది.

భవ్య పథకం ద్వారా 2026 -27 నుంచి 2031-32 వరకు ఆరేళ్లలో 100 నుంచి వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేస్తారు. ఇందుకోసం ఒక ఎకరాకు రూ.కోటి వరకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయనుంది. తొలి విడతలో 50 పార్కులను అభివృద్ధి చేస్తారు. ఈ పార్క్‌లకు అంతర్గత రహదారులు, అండర్‌గ్రౌండ్‌ సదుపాయాలు, డ్రైనేజీ, కామన్‌ ట్రీట్‌మెంట్‌ ఫెసిలిటీస్, ఐసీటీ, పాలనా వ్యవస్థలు లాంటి కీలక మౌలిక వసతులన్నీ సమకూరుస్తారు. ఇవేకాకుండా రెడీ-బిల్ట్‌ ఫ్యాక్టరీ షెడ్‌లు, బిల్ట్‌- టు- సూట్‌ యూనిట్‌లు, ప్రయోగశాలలు, గిడ్డంగులు, సిబ్బంది కోసం గృహాలతో పాటు ఇతరత్రా సదుపాయాలనూ ఏర్పాటు చేస్తారు. ఈ భవ్య పథకం ప్రత్యక్షంగా 15లక్షల ఉద్యోగాలను సృష్టిస్తుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు.

రాష్ట్రాలు, ప్రైవేట్ రంగ సంస్థల భాగస్వామ్యంలో ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేయనుంది. ప్రభుత్వ అభివృద్ధి పథకాలకు భూములను సేకరించేటప్పుడు బాధితులకు, నిర్వాసితులకు ఇచ్చే నష్టపరిహారం సంతృప్తికరంగా లేకపోవడం, తక్కువ ధరకు ప్రభుత్వం కొనుగోలు చేయడం, పునరావాసం కల్పించకపోవడం.. ఇలాంటి సమస్యలతో ప్రజల్లో ఆందోళన నెలకొంటుంది. ఈ నేపథ్యంలో ఈ సమస్యలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం భవ్య పథకంను తీసుకొచ్చింది. భూమి ధర ఒకవేళ ఎకరానికి కోటి రూపాయలకంటే ఎక్కువ ఉన్న పక్షంలో గరిష్ఠంగా కేంద్ర ప్రభుత్వం రూ.కోటిని సమకూర్చుతుంది. మిగిలిన సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ ప్లేయర్లు భరిస్తారు.