Booster Dose: బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్‌పై కేంద్రం ఫోకస్
కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్రం ఫోకస్ పెంచింది. ఈ క్రమంలోనే బూస్టర్ డోస్‌పై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే త్వరలో 18 ఏళ్ల పైబడిన భారత పౌరులందరికీ బూస్టర్ డోస్ ఇచ్చే దిశగా..
- Subhan Ali Shaik
- Published On : March 22, 2022 / 09:01 AM IST
Covishield Dose Gap
Booster Dose: కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్రం ఫోకస్ పెంచింది. ఈ క్రమంలోనే బూస్టర్ డోస్‌పై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే త్వరలో 18 ఏళ్ల పైబడిన భారత పౌరులందరికీ బూస్టర్ డోస్ ఇచ్చే దిశగా కేంద్రం కసరత్తు చేస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు అనేక దేశాల్లో పెరగడంతో బూస్టర్ డోస్ కు ప్రాముఖ్యతనిచ్చే దిశగా కేంద్రం సమాయత్తమవుతుంది.
ప్రస్తుతం ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ వర్కర్లు, 60 ఏళ్ల పైబడిన వారికి మాత్రమే బూస్టర్ డోస్ అందుబాటులో ఉంది. రెండో డోస్ తీసుకున్నాక 9 నెలలు లేదా 39 వారాల తరువాత బూస్టర్ డోస్‌కు కేంద్రం అనుమతి ఇస్తుంది.
మార్చి 20 ఆదివారం 17 వందలకుపైగా కేసులు నమోదుకాగా, సోమవారం వెయ్యి 549 మంది కరోనా బారినపడ్డారు. దీంతో మొత్తం కేసులు 4కోట్ల 30లక్షల 9వేల 390కి చేరాయి. ఇందులో 4కోట్ల 24లక్షల 67వేల 774 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. మరో 5లక్షల 16వేల 510 మంది మృతిచెందగా, 25వేల 106 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
Read Also: బూస్టర్ డోసుగా భారత్ బయోటెక్ ఇంట్రానాసల్ వ్యాక్సిన్ పై ట్రయల్స్ షురూ
గత 24 గంటల్లో కొత్తగా 31 మంది మరణించారని, 2వేల 652 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇప్పటివరకు 181కోట్ల 24లక్షల 97వేల 303 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్లు వెల్లడించింది.
