Covid Vaccine: బూస్టర్ డోసుగా భారత్ బయోటెక్ ఇంట్రానాసల్ వ్యాక్సిన్ పై ట్రయల్స్ షురూ

భారతీయ ఫార్మా దిగ్గజం "భారత్ బయోటెక్" అభివృద్ధి చేసిన "ఇంట్రానాసల్ వ్యాక్సిన్"(ముక్కు ద్వారా తీసుకునే టీకా)పై ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

Covid Vaccine: బూస్టర్ డోసుగా భారత్ బయోటెక్ ఇంట్రానాసల్ వ్యాక్సిన్ పై ట్రయల్స్ షురూ

Bharat Bio

Covid Vaccine: దేశంలో కరోనా మహమ్మారిని తరిమికొట్టడమే లక్ష్యంగా, కరోనా వ్యాక్సిన్ పై ఇంకా పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే దేశంలో 179 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేయగా.. మిగతా దేశాలతో పోల్చితే మనదేశంలో కరోనా వ్యాప్తి అదుపులోకి వచ్చింది. అయితే మహమ్మారిని పూర్తిగా అంతమొందించాలంటే మరింత సమర్ధవంతమైన వ్యాక్సిన్లు అవసరం ఉంటుంది. ఈక్రమంలో భారతీయ ఫార్మా దిగ్గజం “భారత్ బయోటెక్” అభివృద్ధి చేసిన “ఇంట్రానాసల్ వ్యాక్సిన్”(ముక్కు ద్వారా తీసుకునే టీకా)పై ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఢిల్లీ (AIIMS) పర్యవేక్షణలో భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన “BBV154” ఇంట్రానాసల్ కోవిడ్-19 వ్యాక్సిన్ ను శుక్రవారం నుంచి బూస్టర్ డోసుగా వాలంటీర్లపై ప్రయోగించి పరీక్షలు జరుపనున్నారు.

Also read:Telangana Covid : తెలంగాణలో కొత్తగా 91 కరోనా కేసులు

డ్రగ్ కంట్రోలర్ అఫ్ ఇండియా (DCGI) ఇప్పటికే ఈ వ్యాక్సిన్ కు అనుమతులు ఇవ్వగా..జనవరి నుంచి ఫేజ్ 3 దశలో భాగంగా బూస్టర్‌ డోసుగా ఇంట్రా-నాసల్ వ్యాక్సిన్ పై వివిధ దశల బహుళ-కేంద్రీకృత అధ్యయనం కొనసాగుతుంది. కాగా, భారత్ లో ఇప్పటికే కోవాక్సిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్ పంపిణీ జరిగింది. అయితే ప్రస్తుతం భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన “BBV154” ఇంట్రానాసల్ వ్యాక్సిన్.. కోవాక్సిన్, కోవిషీల్డ్ రెండు డోసులు తీసుకున్నవారు సైతం బూస్టర్ డోసుగా తీసుకునే విధంగా వ్యాక్సిన్ ను అభివృద్ధి చేశారు. ప్రస్తుత ట్రయల్స్ కూడా ఆదిశగానే జరుగుతున్నాయి. ట్రయల్స్ లో భాగంగా కోవాక్సిన్, కోవిషీల్డ్ రెండు డోసులు తీసుకున్న వారికే ఈ “BBV154” ఇంట్రానాసల్ వ్యాక్సిన్ ఇవ్వనున్నారు.

Also read: Ants detect cancer cells : చీమలు మనిషిలో క్యాన్సర్‌ కణాలను గుర్తించగలవు..తాజా పరిశోధనల్లో వెల్లడి

మొత్తం 800 మంది వాలంటీర్లు ఈ నాసల్ వ్యాక్సిన్ ట్రయల్స్ కోసం పేర్లు నమోదు చేసుకున్నారు. భారత్ లో ఇప్పటివరకు కోవిడ్ టీకాలు వేసిన వ్యక్తులలో బూస్టర్ డోస్‌గా “BBV154” ఇచ్చినప్పుడు మూడు వ్యాక్సిన్‌ల యొక్క రోగనిరోధక శక్తిని మరియు భద్రతను అంచనా వేయడం ఈ అధ్యయనం యొక్క ముఖ్య ఉద్దేశ్యమని ఎయిమ్స్ ప్రతినిధులు పేర్కొన్నారు. ప్రస్తుతం జరుపుతున్న ట్రయల్స్ మరియు ఇప్పటి వరకు జరిగిన అధ్యయనాల నివేదికను సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO)కు నివేదించనున్నారు. మరోవైపు భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాక్జిన్ కరోనా టీకాకు క్లినికల్ పరీక్షలు పూర్తి చేస్తూ అమెరికాలోని ఆరోగ్య నియంత్రణ విభాగం పచ్చజెండా ఊపింది.