Nothing Phone 4a Launch : మీరు రెడీనా? కొత్త నథింగ్ ఫోన్ 4a వచ్చేస్తోందోచ్.. ఫీచర్లు భలే ఉన్నాయి భయ్యా.. ధర ఎంత ఉండొచ్చంటే?

Nothing Phone 4a Launch : నథింగ్ ఫోన్ 4a లాంచ్ అయ్యేందుకు రెడీగా ఉంది. ముందుగానే ఈ నథింగ్ ఫోన్ ధర, స్పెషిఫికేషన్లు, డిజైన్, కెమెరాకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Nothing Phone 4a Launch : మీరు రెడీనా? కొత్త నథింగ్ ఫోన్ 4a వచ్చేస్తోందోచ్.. ఫీచర్లు భలే ఉన్నాయి భయ్యా.. ధర ఎంత ఉండొచ్చంటే?

Nothing Phone 4a Launch

Updated On : November 21, 2025 / 6:12 PM IST

Nothing Phone 4a Launch : నథింగ్ అభిమానులకు గుడ్ న్యూస్.. అతి త్వరలో మిడ్‌రేంజ్ లైనప్‌లో కొత్త నథింగ్ ఫోన్ రాబోతుంది. నివేదికల ప్రకారం.. నథింగ్ ఫోన్ 4a లాంచ్ కానుందని సూచిస్తున్నాయి. లండన్‌కు చెందిన ఈ స్మార్ట్‌ఫోన్ తయారీదారు ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటికీ, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS)లో కొత్త జాబితాను ప్రవేశపెట్టింది.

ఈ నథింగ్ ఫోన్ భారత మార్కెట్లో (Nothing Phone 4a Launch) లాంచ్ అయ్యేందుకు రెడీగా ఉందని సూచిస్తుంది. లీక్‌లను పరిశీలిస్తే.. నథింగ్ ఫోన్ 4a స్పెషిఫికేషన్లు, ఫీచర్లకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

నథింగ్ ఫోన్ 4a స్పెసిఫికేషన్లు, డిజైన్ (అంచనా) :
నథింగ్ ఫోన్ 4a, నథింగ్ ఫోన్ 3aలో డిజైన్, బ్యాక్ ప్యానెల్‌పై ప్రత్యేకమైన మోడల్‌తో రిఫ్రెష్డ్ లుక్‌ కలిగి ఉండొచ్చు. నథింగ్ డిజైన్ లాంగ్వేజీ సాధారణంగా స్పెషల్‌గా ఉంటుంది. ఫ్రంట్ సైడ్ నథింగ్ ఫోన్ 4a మోడల్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.82-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే, 3000 నిట్స్ ఆకట్టుకునే గరిష్ట ప్రకాశాన్ని కలిగి ఉండవచ్చు. పాండా గ్లాస్ ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది. హుడ్ కింద, రాబోయే నథింగ్ ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్‌సెట్‌తో రన్ కావచ్చు.

Read Also : Tata Cars Discounts : టాటా సియెర్రా ఎఫెక్ట్.. ఈ టాటా SUV కార్లపై డిస్కౌంట్లే డిస్కౌంట్లు.. కొంటే ఇప్పుడే కొనేసుకోవడం బెటర్..!

8GB ర్యామ్, 128GB స్టోరేజ్‌తో వస్తుంది. ఆండ్రాయిడ్ 16తో కూడా వస్తుందని భావిస్తున్నారు. నథింగ్ 3 మెయిన్ OS అప్‌గ్రేడ్‌లను అందించే అవకాశం లేదు. నథింగ్ ఫోన్ 4aలో 64MP మెయిన్ కెమెరా, 50MP టెలిఫోటో లెన్స్, 8MP అల్ట్రావైడ్ షూటర్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం నథింగ్ ఫోన్ 3a మాదిరిగానే 32MP ఫ్రంట్ కెమెరాతో రావచ్చు.

భారత్‌లో నథింగ్ ఫోన్ 4a లాంచ్ టైమ్‌లైన్, ధర (అంచనా) :
ఇటీవలే మోడల్ నంబర్ A069తో BIS లిస్టును గుర్తించారు. టిప్‌స్టర్ సుధాన్షు అంబోర్ నథింగ్ ఫోన్ 4aకి చెందినదని ఆయన పేర్కొన్నారు. నథింగ్ గత కోడింగ్ మోడల్‌తో పోలిస్తే నథింగ్ ఫోన్ 3a మోడల్ నంబర్ A059ని కలిగి ఉంది. అయితే, నథింగ్ ఫోన్ 3ప్రో వేరియంట్ A059P టెక్నాలజీతో వచ్చింది.

నవంబర్ 13 నాటి BIS జాబితా స్పెషిఫికేషన్లు లేదా డిజైన్ వివరాలను వెల్లడించలేదు. లీక్‌లు నిజమైతే.. నథింగ్ ఫోన్ 4a ప్రోతో పాటు నథింగ్ ఫోన్ 4a జనవరి 2026 నాటికి భారత మార్కెట్‌లోకి రావచ్చు. ధర విషయానికొస్తే.. ముందస్తు అంచనాల ప్రకారం నథింగ్ ఫోన్ 4a సిరీస్ ధర రూ.25,999 నుంచి రూ.29,999 మధ్య ఉండవచ్చు.