Akhanda 2 Trailer: బాలకృష్ణ విశ్వరూపం.. పవర్ ఫుల్ డైలాగ్స్.. అఖండ 2 ట్రైలర్ వచ్చేసింది.. చూశారా..

ఇక ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎదురుచూస్తున్న ట్రైలర్ వచ్చేసింది.

Akhanda 2 Trailer: బాలకృష్ణ విశ్వరూపం.. పవర్ ఫుల్ డైలాగ్స్.. అఖండ 2 ట్రైలర్ వచ్చేసింది.. చూశారా..

Updated On : November 21, 2025 / 9:00 PM IST

Akhanda 2 Trailer: నందమూరి నట సింహం, గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న సినిమా అఖండ-2. ఈ సినిమాపై ఫ్యాన్స్ లో భారీగానే అంచనాలు ఉన్నాయి. ఇక ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎదురుచూస్తున్న ట్రైలర్ వచ్చేసింది.

‘ఇప్పటి వరకూ ప్రపంచపటంలో ఉన్న మా దేశ రూపాన్ని మాత్రమే చూసుంటావు‌. ఎప్పుడూ మా దేశ విశ్వరూపాన్ని చూసుండవు‌’ అంటూ బాలకృష్ణ చెప్పిన పవర్‌ ఫుల్‌ డైలాగులు, విజువల్స్‌ సూపర్ అని ఫ్యాన్స్ అంటున్నారు.

ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ను బెంగళూరులో గ్రాండ్ గా నిర్వహించారు. శివ రాజ్ కుమార్ చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అనంతరం సోషల్‌ మీడియాలో ట్రైలర్‌ ను రిలీజ్‌ చేసింది చిత్ర బృందం. సనాతన ధర్మం ప్రధాన అంశంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతుంది. ఇందులో బాలయ్య మూడు గెటప్స్ లో (వృద్ధ అఘోరా, యువ అఘోరా, యువ వ్యాపారవేత్తగా) కనిపించారు. థమన్ దీనికి మ్యూజిక్ డైరెక్టర్. అఖండ 2 చిత్రం డిసెంబర్ 5న ప్రపచంవ్యాప్తంగా విడుదల కానుంది. అఖండకు స్వీకెల్ గా ఈ సినిమా వస్తోంది.

Also Read: ’12A రైల్వే కాలనీ’ మూవీ రివ్యూ.. అల్లరి నరేష్ సస్పన్స్ థ్రిల్లర్ సినిమా ఎలా ఉంది..?