Premante Review : ‘ప్రేమంటే’ మూవీ రివ్యూ.. భార్యతో కలిసి దొంగతనాలు చేయడం ఏంట్రా.. భలే ఉందే..
ప్రియదర్శి గత సినిమా మిత్రమండలి అప్పుడు ఆ సినిమా హిట్ అవ్వకపోతే తన నెక్స్ట్ సినిమా చూడొద్దు అనే స్టేట్మెంట్ ఇవ్వడంతో ప్రేమంటే సినిమా కాస్త వైరల్ అయింది. (Premante Review)
Premante Review
Premante Review : ప్రియదర్శి, ఆనంది జంటగా తెరకెక్కిన సినిమా ‘ప్రేమంటే’. రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP బ్యానర్ పై పుస్కూర్ రామ్ మోహన్ రావు, జాన్వీ నరంగ్ నిర్మాణంలో నవనీత్ శ్రీరామ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. యాంకర్ సుమ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించింది. ప్రేమంటే సినిమా నేడు నవంబర్ 21న థియేటర్స్ లో రిలీజయింది.(Premante Review)
కథ విషయానికొస్తే.. మది(ప్రియదర్శి) రమ్య(ఆనంది) అనుకోకుండా ఓ పెళ్లిలో పరిచయమై ఒకరి క్వాలిటీస్ ఒకరికి నచ్చడంతో పెళ్లి చేసుకుంటారు. మది సెక్యూరిటీ సిస్టమ్స్ వర్క్ చేస్తూ ఉంటాడు. మది చేసే కొన్ని పనులతో రమ్యకు అనుమానం వచ్చి ఇంకో అమ్మాయితో తిరుగుతున్నావా అని ప్రశ్నిస్తుంది. ఈ క్రమంలో వీళ్ళిద్దరికీ గొడవ అవడంతో మది తను ఒక దొంగ అని, తన ఫ్రెండ్స్ తో కలిసి దొంగతనాలు చేస్తాడని చెప్పడంతో రమ్య షాక్ అవుతుంది. మదిని వదిలి వెళ్ళిపోవడానికి రమ్య సిద్దమవడంతో తనకున్న సమస్యలు చెప్పి అందుకోసమే దొంగతనాలు చేస్తున్నానని చెప్పడంతో దొంగతనాలు మానేస్తే నీతో ఉంటాను లేకపోతే వెళ్ళిపోతానని చెప్తుంది.
దీంతో మది దొంగతనాలు మానేసి ఒక జాబ్ లో జాయిన్ అవుతాడు. కానీ తనకున్న ఇల్లు అప్పుల ప్రెషర్ వల్ల చివరిగా ఒకే ఒక్క దొంగతనం చేసి మానేద్దాం అనుకుంటాడు. ఈ విషయం రమ్యకి తెలియడంతో మదితో పాటు దొంగతనానికి వెళుతుంది. కానీ ఆ దొంగతనం ఫెయిల్ అయ్యి కొద్దిలో ఎస్కేప్ అవుతారు. ఆ తర్వాత రమ్య థ్రిల్ కోసం, తమ సమస్యల కోసం ఇద్దరు కలిసి దొంగతనాలు చేద్దాం అంటుంది. మరోవైపు ఆశా మేరీ ఒక పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తూ లైఫ్ లో ఎప్పటికైనా ఒక కేసైనా సాల్వ్ చేయాలి అనుకుంటుంది. తను చేసిన కొన్ని పనులతో తనకు నైట్ పెట్రోలింగ్ జాబ్ పడుతుంది. ఆశ మేరీకి మది రమ్య చేసిన ఓ దొంగతనం కేసు వస్తుంది. అసలు మది రమ్యలు దొంగతనాలు ఎందుకు చేస్తున్నారు? ఆశమేరి ఈ కేసు ఎలా సాల్వ్ చేస్తుంది? అసలు ఎలాంటి అనుమానాలు రాకుండా, కంప్లైంట్స్ రాకుండా మది రమ్యలు ఎలాంటి దొంగతనాలు చేస్తున్నారు? భార్యాభర్తలు ఇద్దరూ కలిసి దొంగతనాలు ఎలా చేస్తారు.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
Also Read : Paanch Minar Review : ‘పాంచ్ మినార్’ మూవీ రివ్యూ.. క్రైం కామెడీతో రాజ్ తరుణ్ హిట్ కొట్టాడా?
సినిమా విశ్లేషణ..
ప్రియదర్శి గత సినిమా మిత్రమండలి అప్పుడు ఆ సినిమా హిట్ అవ్వకపోతే తన నెక్స్ట్ సినిమా చూడొద్దు అనే స్టేట్మెంట్ ఇవ్వడంతో ప్రేమంటే సినిమా కాస్త వైరల్ అయింది. ఫస్ట్ హాఫ్ ఓపెనింగ్ హీరో – హీరోయిన్ పరిచయం పెళ్లిలో కలిసే సీన్ తో కొత్తగా ఆసక్తిగా మొదలుపెట్టారు. ఆ తర్వాత భార్యాభర్తల రిలేషన్ షిప్ కాసేపు రొమాంటిక్ గా సాగదీశారు. మది ఒక దొంగ అని తెలియయడంతో అక్కడ్నుంచి కథ ఆసక్తిగా మారుతుంది. ఇంటర్వెల్ ముందు రమ్య దొంగతనంలో భాగమయ్యే సీన్ ఇంట్రెస్ట్ గా ఉంటుంది. మది దొంగతనాల్లోకి రమ్య భాగం అవుతాను అని చెప్పడంతో నెక్స్ట్ ఏం జరుగుతుంది అని సెకండ్ హాఫ్ పై ఆసక్తి నెలకొంటుంది.
ఇక సెకండ్ హాఫ్ లో ఇద్దరూ కలిసి చేసే దొంగతనాలు భలే చూపించారు. కామెడీగా చూపిస్తూనే వీరిద్దరి మధ్య ఉన్న ప్రేమను చూపించారు. ఇదంతా చూస్తే బంటీ ఆర్ బబ్లు, భలే దొంగలు సినిమా గుర్తుకు రావడం ఖాయం. కాకపోతే ఇందులో భార్యాభర్తలు. ప్రీ క్లైమాక్స్ లో కాస్త భార్య – భర్తల మధ్య ఎమోషన్ ని పెట్టి కొంత సాగదీశారు. సుమ ట్రాక్ మొదట్లో కథలో ఇమడకపోయినా ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన దగ్గర్నుంచి ఇంట్రెస్ట్ గా సాగుతుంది. సుమ – వెన్నెల కిషోర్ – హైపర్ ఆది లతో కామెడీ ట్రాక్ ట్రై చేశారు కానీ అంతగా వర్కౌట్ అవ్వలేదు. భార్య – భర్తలు తమ ప్రేమ కోసం, తమ రిలేషన్ కోసం లైఫ్ లో ఎన్ని వచ్చినా కలిసే ఉండాలి అనే కాన్సెప్ట్ ని కామెడీతో – దొంగతనాలతో మిక్స్ చేసి చూపించడం గమనార్హం.

నటీనటుల పర్ఫార్మెన్స్..
ప్రియదర్శి ఎప్పటిలాగే తన పర్ఫామెన్స్ తో నవ్విస్తూ మెప్పించాడు. లైఫ్ లో థ్రిల్ కావాలనుకునే భార్య పాత్రలో ఆనంది చాలా బాగా నటించింది. యాంకర్ సుమ యాక్టింగ్ కాస్త ఆర్టిఫీషియల్ గా అనిపించినా నటనతో నవ్వించడానికి బాగానే ట్రై చేసింది. వెన్నెల కిషోర్, అభయ్, హైపర్ ఆది.. మిగిలిన నటీనటులు అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేసారు. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో బాగానే మెప్పించారు.
Also Read : Raju Weds Rambai Review : ‘రాజు వెడ్స్ రాంబాయి’ మూవీ రివ్యూ.. బాబోయ్ ఇదెక్కడి క్లైమాక్స్ రా బాబు..
సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ చాలా రిచ్ గా బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు చాలా ప్లస్ అయింది. సాంగ్స్ మాత్రం యావరేజ్. ఎడిటింగ్ కూడా బాగుంది. బంటి ఔర్ బబ్లూ లాంటి కాన్సెప్ట్ ను భార్యాభర్తల మధ్య రాసుకొని సస్పెన్స్ కామెడీతో ఓ చిన్న ఎమోషన్ తో బాగానే రాసుకున్నాడు దర్శకుడు. నిర్మాణ పరంగా కూడా ఈ సినిమాకు బాగానే ఖర్చుపెట్టినట్టు తెరపై కనిపిస్తుంది.
మొత్తంగా ‘ప్రేమంటే’ సినిమా భార్యాభర్తల మధ్య ఎన్ని సమస్యలు వచ్చినా కలిసే ఉండాలి అదే ప్రేమంటే అని చెప్పే ప్రయత్నం చేసారు. కాసేపు నవ్వుకోవడానికి ఈ సినిమా చూసేయొచ్చు. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
