Nothing Phone 3 Price : వారెవ్వా.. ఇది కదా డిస్కౌంట్.. నథింగ్ ఫోన్ 3 అతి చౌకైన ధరకే.. అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే?

Nothing Phone 3 Price : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? అమెజాన్ ఇండియాలో నథింగ్ ఫోన్ 3 భారీ తగ్గింపు ధరకే లభిస్తోంది. ప్రీమియం ఫోన్ కోరుకునే యూజర్లకు అద్భుతమైన ఆప్షన్. ఈ నథింగ్ ఫోన్ మొదట రూ.79,999కి లాంచ్ కాగా ఇప్పుడు డిస్కౌంట్లు, బ్యాంక్ డీల్స్ ద్వారా ధర రూ.45వేల కన్నా భారీగా తగ్గింపు పొందింది.

ఆసక్తిగల కొనుగోలుదారులు సరసమైన ధరకే ఈ నథింగ్ ఫోన్ సొంతం చేసుకోవచ్చు. ధర తగ్గింపు, బ్యాంక్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ డీల్స్‌తో పాటు అద్భుతమైన పర్ఫార్మెన్స్, స్టైలిష్ డిజైన్ పాకెట్-ఫ్రెండ్లీ రేటుకు ఎక్కువ బ్యాటరీ లైఫ్ కోరుకునే యూజర్లకు అద్భుతమైన ఆప్షన్ అని చెప్పొచ్చు. ఈ డీల్ ఎలా పొందాలంటే? ఇప్పుడు చూద్దాం..

అమెజాన్‌లో నథింగ్ ఫోన్ 3 డీల్ : అమెజాన్‌లో ఇప్పుడు నథింగ్ ఫోన్ 3 మోడల్ రూ.46,512 ధరకు అందుబాటులో ఉంది. లాంచ్ ధర కన్నా రూ.33వేల కన్నా భారీ తగ్గింపు పొందవచ్చు. ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో కొనుగోలుదారులు రూ.3వేలు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. ఫైనల్ అమౌంట్ రూ.43,512కి తగ్గింపు పొందవచ్చు.

ప్రస్తుతానికి ఈ ఫోన్ అత్యంత చౌకైన ఫోన్లలో ఒకటి. అమెజాన్ ఈ ఫోన్ కొనుగోలుపై ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్ కూడా అందిస్తోంది. పాత ఫోన్ ఎక్స్ఛేంజ్‌పై రూ.43,200 వరకు వాల్యూను పొందవచ్చు. అయితే, మీ పాత ఫోన్ మోడల్, వర్కింగ్ కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది. అమెజాన్ నెలకు దాదాపు రూ.2,255 నుంచి నో కాస్ట్ ఈఎంఐ ప్లాన్‌లను కూడా అందిస్తోంది.

నథింగ్ ఫోన్ (3) స్పెసిఫికేషన్లు : నథింగ్ ఫోన్ 3 మోడల్ 6.67 అంగుళాల అమోల్డ్ స్క్రీన్‌తో వస్తుంది. క్లియర్ ఫొటో క్వాలిటీతో వస్తుంది. డిస్‌ప్లే గొరిల్లా గ్లాస్ 7iతో ప్రొటెక్షన్ అందిస్తుంది. ఈ నథింగ్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. 512GB ఇంటర్నల్ స్టోరేజీతో 16GB ర్యామ్ వరకు అందిస్తుంది.

ఈ ఫోన్ 5,500mAh బ్యాటరీతో పనిచేస్తుంది. 65W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. కెమెరా ఫ్రంట్ సైడ్ 50MP మెయిన్ కెమెరా, పెరిస్కోప్ లెన్స్, అల్ట్రావైడ్ సెన్సార్, సెల్ఫీల కోసం ఫ్రంట్ సైడ్ 50MP కెమెరా ఉంటుంది.
