Ntr-Trivikram: ఎన్టీఆర్ తో మరో హీరోనా.. త్రివిక్రమ్ ఎం ప్లాన్ చేస్తున్నాడు.. ఎవరు చూస్తారు..

న్టీఆర్.. ఈ పేరుకి ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం(Ntr-Trivikram) లేదు. ఈయన నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ఆ బాక్సాఫీస్ వైబ్రేషన్స్ ఒక రేంజ్ లో ఉంటాయి.

Ntr-Trivikram: ఎన్టీఆర్ తో మరో హీరోనా.. త్రివిక్రమ్ ఎం ప్లాన్ చేస్తున్నాడు.. ఎవరు చూస్తారు..

Kannada star Rishab Shetty to play a special role in NTR-Trivikram movie

Updated On : November 21, 2025 / 12:35 PM IST

Ntr-Trivikram: ఎన్టీఆర్.. ఈ పేరుకి ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ఆ బాక్సాఫీస్ వైబ్రేషన్స్ ఒక రేంజ్ లో ఉంటాయి. అందుకు ఆయన ఫ్యాన్స్ ఆయన్ని ప్రేమగా మ్యాన్ ఆఫ్ మాసెస్ అని పిలుచుకుంటారు. అంతేకాదు, ఆ ట్యాగ్ కి పర్ఫెక్ట్ యాప్ట్ అంటే ఎన్టీఆర్ అనే చెప్పాలి. రీసెంట్ గా దేవర సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు ఎన్టీఆర్. భారీ అంచనాల మధ్య పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.500 కోట్ల వసూళ్లు రాబట్టింది.

Kriti Sanon: కృతి సనన్ పరువాల విందు.. చూస్తే మతిపోవాల్సిందే.. ఫోటోలు

ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ఇంటర్నేషనల్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అయితే, ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ మతాల మాంత్రికుడు త్రివిక్రమ్(Ntr-Trivikram) తో ఓ సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్నాయి. నిజానికి చాలా కాలం నుంచే ఈ కాంబోలో సినిమా గురించి రకరకాల న్యూస్ వైరల్ అవుతూనే ఉన్నాయి. రీసెంట్ గా ఆ వార్తలు మరింత ఎక్కువ అయ్యాయి. ఇండియన్ మైథాలజీలోని ఒక పవర్ ఫుల్ పాత్రతో ఈ సినిమా రానుంది అని నిర్మాత నాగ వంశీ గతంలోనే చెప్పాడు. ఇక అప్పటినుండి ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

తాజాగా ఈ సినిమా గురించి ఒక క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది. అదేంటంటే, ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబోలో రాయబోతున్న పాన్ ఇండియా సినిమాలో మరో స్టార్ హీరోకి కూడా ఛాన్స్ ఉందట. ఆ పాత్ర స్పెషల్ గా వచ్చినప్పటికీ కథలో చాలా ప్రాముఖ్యత ఉంటుందని టాక్ నడుస్తోంది. అందుకే, ఈ పాత్ర కోసం కన్నడ స్టార్ రిషబ్ శెట్టిని తీసుకోవాలని చూస్తున్నాడట త్రివిక్రమ్. కాంతార, కాంతార 2 సినిమాలతో రిషబ్ శెట్టికి పాన్ ఇండియా లెవల్లో ఫుల్ క్రేజ్ ఏర్పడింది. అలాగే, ఎన్టీఆర్-రిషబ్ శెట్టికి మధ్య కూడా మంచి స్నేహం ఉంది. కాబట్టి, ఎన్టీఆర్ సినిమా కోసం రిషబ్ శెట్టిని తీసుకుంటే అన్నిరకాలుగా బాగుటుందని భావిస్తున్నారట మేకర్స్. అయితే, ఈ న్యూస్ తెలిసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం డిజప్పాయింట్ అవుతున్నారు. ఎందుకంటే, ఎన్టీఆర్ సినిమా అంటే కేవలం ఆయన్ని చూడటానికి మాత్రమే ఆడియన్స్ వస్తారు. అలాంటివి, ఎన్టీఆర్ తో మరో స్టార్ యాక్ట్ చేస్తే ఎవరు ఇంట్రెస్ట్ చూపించరు అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఫ్యాన్స్ కామెంట్స్ పై మేకర్స్ ఎలా స్పందిస్తారు అనేది చూడాలి.