Vivo X300 Series : వివో క్రేజే వేరబ్బా.. DSLR రేంజ్‌లో 200MP కెమెరా ఫోన్ వస్తోంది.. ధర ఎంతో తెలిసిందోచ్..!

Vivo X300 Series : వివో నుంచి సరికొత్త ఫోన్ లాంచ్ కానుంది. డీఎస్ఎల్ఆర్ ఫొటోగ్రఫీతో 200MP కెమెరా అత్యంత ఆకర్షణీయంగా ఉండనుంది. వివో X300 సిరీస్ ఫీచర్లు, ధరపై భారీ అంచనాలివే..

Vivo X300 Series : వివో క్రేజే వేరబ్బా.. DSLR రేంజ్‌లో 200MP కెమెరా ఫోన్ వస్తోంది.. ధర ఎంతో తెలిసిందోచ్..!

Vivo X300 Series

Updated On : November 21, 2025 / 8:24 PM IST

Vivo X300 Series : వివో ఫ్యాన్స్ గెట్ రెడీ.. అతి త్వరలో భారత మార్కెట్లోకి వివో X300 సిరీస్ రాబోతుంది. నివేదికల ప్రకారం.. ఈ వివో సిరీస్ డిసెంబర్ 2న లాంచ్ కానుంది. ఈ సిరీస్‌లో కంపెనీ రెండు స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేయనుంది. అందులో వివో X300, వివో X300 ప్రో ఫోన్లు. ఈ రెండు వివో ఫోన్‌లు ఇప్పటికే చైనా మార్కెట్లో లాంచ్ అయ్యాయి.

భారత మార్కెట్లో వివో X300 సిరీస్ ధర (Vivo X300 Series) లాంచ్‌కు ముందే లీక్ అయింది. వివో X300 ఫోన్ 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 75,999గా ఉండవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ ధరకు లాంచ్ అయితే వివో ఫోన్ వన్‌ప్లస్ 15, ఒప్పో ఫైండ్ X9 కన్నా అత్యంత ఖరీదైనదిగా ఉండొచ్చు.

వివో X300 ఫీచర్లు, స్పెషిఫికేషన్లు :
ఈ స్మార్ట్‌ఫోన్ 3 కాన్ఫిగరేషన్‌లలో వస్తుంది. 12GB ర్యామ్ + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 81,999, 16GB ర్యామ్ + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 85,999 ఉంటుందని అంచనా. వివో X300 ప్రో ధర రూ. 109,999 నుంచి ప్రారంభమవుతుంది. ఈ ఫోన్ సింగిల్ కాన్ఫిగరేషన్‌లో వస్తుంది. 16GB ర్యామ్ + 512GB స్టోరేజీతో వస్తుంది.

Read Also : Best Vivo Camera Phones : ఈ 5 వివో కెమెరా ఫోన్లు వేరే లెవెల్.. ఫొటోగ్రఫీ లవర్స్ తప్పక కొనాల్సిన ఫోన్లు.. ఫస్ట్ ఫోన్ రేంజే వేరబ్బా..!

కిట్ ధర ఎంత? :
ఈ వివో ఫోన్‌తో పాటు కంపెనీ టెలిఫోటో ఎక్స్‌టెండర్ కిట్‌ను కూడా రిలీజ్ చేయనుంది. ఈ కిట్ ధర రూ. 20,999 ఉంటుందని అంచనా. వివో X300 ప్రో ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టుతో 6.78-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంది.

మీడియాటెక్ డైమన్షిటీ 9500 ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది. ఈ వివో X300 ఫోన్ 50MP+200MP+50MP టెలిఫోటో లెన్స్‌ను కలిగి ఉంది. కంపెనీ ఫ్రంట్ సైడ్ 50MP సెల్ఫీ కెమెరా కూడా అందించింది. గ్లోబల్ మార్కెట్లలో ఈ స్మార్ట్‌ఫోన్ 6510mAh బ్యాటరీతో వస్తుంది.

90W వైర్డు, 40W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. వివో X300 ఫోన్ 6.31-అంగుళాల అమోల్డ్, డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 9500 ప్రాసెసర్, 200MP + 50MP + 50MP బ్యాక్ కెమెరా సెటప్, 50MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. 6040mAh బ్యాటరీతో రన్ అవుతుంది.