Gold Monetization Scheme : ఇంట్లో బంగారం ఉన్నవారికి కేంద్రం అదిరిపోయే శుభవార్త.. కొత్త స్కీం వచ్చేస్తోంది.. డబ్బులేడబ్బులు.. ఇంకా అనేక ఉపయోగాలు..
Gold Monetization Scheme (GMS): రూపాయి విలువను బలోపేతం చేయడానికి బంగారం దిగుమతులను తగ్గించే ప్రయత్నాల్లో ప్రభుత్వం ఉందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలో కేంద్రం ఓ కొత్త పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అదే గోల్డ్ మానిటైజేషన్ పాలసీ. ఈ పథకాన్ని గతంలోనూ అమలు చేశారు.. అయితే, ప్రస్తుతం కొన్ని మార్పులతో మళ్లీ ఈ పథకాన్ని అమల్లోకి తెచ్చేందుకు కేంద్రం సిద్ధమైంది.
- Harish Thanniru
- Updated on- May 15, 2026 / 10:20 AM IST
Central Government to Implement Gold Monetization Scheme
Gold Monetization Scheme : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఇటీవల ఓ విజ్ఞప్తి చేశారు. ఒక సంవత్సరం పాటు ప్రజలు బంగారం కొనుగోళ్లు నిలిపివేయాలని సూచించారు. మోదీ సూచనపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఇదే సమయంలో విమర్శలుసైతం పెరుగుతున్నాయి. ఇరాన్ -అమెరికా యుద్ధం నేపథ్యంలో విదేశీ మారక నిల్వల (Foreign Exchange Reserves) పరిరక్షణ కోసం, అలాగే రూపాయి విలువ తగ్గుముఖం పట్టకుండా ఉండటానికి బంగారం కొనుగోళ్లు తగ్గించాలని మోదీ కోరారు. మోదీ సూచన కారణంగా భారీ స్థాయిలో ఇబ్బందులు రావొచ్చుననే ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. మోదీ చెప్పినట్లుగా చేస్తే దేశంలోని 3.5కోట్ల మంది ప్రజల జీవనోపాధికి ముప్పు కలిగించే ప్రమాదం ఉందని ఆల్ ఇండియా జ్యువెలర్స్ అండ్ గోల్డ్ స్మిత్ ఫెడరేషన్ పేర్కొంది.
Also Read : Petrol Price Hike : వాహనదారులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. నేటి నుంచే అమల్లోకి..
రూపాయి విలువను బలోపేతం చేయడానికి బంగారం దిగుమతులను తగ్గించే ప్రయత్నాల్లో ప్రభుత్వం ఉందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలో కేంద్రం ఓ కొత్త పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అదే గోల్డ్ మానిటైజేషన్ పాలసీ. ఈ పథకాన్ని గతంలోనూ అమలు చేశారు.. అయితే, ప్రస్తుతం కొన్ని మార్పులతో మళ్లీ ఈ పథకాన్ని అమల్లోకి తెచ్చేందుకు కేంద్రం సిద్ధమైంది. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేలా కేంద్రం ఈ కొత్త పాలసీని అందుబాటులోకి తేనున్నట్లు సమాచారం. తద్వారా ఇంట్లో ఉన్న బంగారంతో వడ్డీ వచ్చేలా ప్రతిపాదించనుంది. వినియోగదారులు వద్ద కనీసం 10గ్రాముల బంగారం ఉంటే బ్యాంకులో డిపాజిట్ చేయొచ్చు. డిపాజిట్ చేసిన బంగారంపై వార్షిక వడ్డీ రేటు సుమారు 2 శాతం నుంచి 2.5శాతం వరకు పొందచ్చు. ఈ కొత్త పాలసీ ద్వారా సుమారు 2వేల టన్నుల బంగారం డిపాజిట్ అయితే, మూడేళ్ల వరకు దిగుమతుల అవసరం ఉండదని అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం భారతీయుల వద్ద సుమారు 30వేల టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయని అంచనా. దీనిలో కొంత భాగాన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం ద్వారా.. రూపాయి విలువను బలోపేతం చేయడంతోపాటు బంగారం దిగుమతులను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నంగా ఉందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే, ఈ కొత్త గోల్డ్ మానిటైజేషన్ పాలసీపై కేంద్ర ఆర్థిక శాఖ త్వరలో స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
గోల్డ్ మానిటైజేషన్ స్కీం అంటే ఏమిటి..
కేంద్ర ప్రభుత్వం 2015లో గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్‌ను తీసుకొచ్చింది. కానీ, 2025 మార్చి 26 తరువాత ఈ స్కీమ్‌ను నిలిపివేసింది. ఈ స్కీమ్ లో ఉన్న మధ్యకాల, దీర్ఘకాల డిపాజిట్ ఆప్షన్లు పూర్తిగా నిలిపివేశారు. ఇప్పుడు కేవలం షార్ట్ టర్మ్ బ్యాంక్ డిపాజిట్ మాత్రమే కొనసాగుతోంది. ఇది దేశంలో వాడని ఇంటి బంగారాన్ని ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావడానికి ఉన్న విధానంలో పెద్ద మార్పుగా చెప్పొచ్చు. ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ మళ్లీ ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ స్కీమ్ ఎలా పనిచేస్తుంది..?
- గోల్డ్ డిపాజిట్ పథకం కింద ప్రజలు తమ వద్ద ఉన్న బంగారాన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి అవకాశం కల్పించబడుతుంది.
- ఈ పథకం ప్రకారం వినియోగదారులు తమ బంగారాన్ని Bureau of Indian Standards (BIS) గుర్తింపు పొందిన కలెక్షన్ అండ్ ప్యూరిటీ టెస్టింగ్ సెంటర్లలో (CPTC) జమ చేయాలి.
- అక్కడ బంగారం స్వచ్ఛతను పరీక్షించి, 995 ఫైనెనెస్ ప్రమాణాల ప్రకారం డిపాజిట్ సర్టిఫికెట్ జారీ చేస్తారు.
- ఈ పథకం ద్వారా డిపాజిట్ చేసిన బంగారంపై వినియోగదారులు వడ్డీ కూడా పొందవచ్చు.
- స్వల్పకాలిక డిపాజిట్లకు (1-3 సంవత్సరాలు) వడ్డీ రేట్లను సంబంధిత బ్యాంకులు నిర్ణయిస్తాయి.
- అంతర్జాతీయ గోల్డ్ లీజ్ రేట్లు, మార్కెట్ పరిస్థితులు, ఇతర ఖర్చులను ఆధారంగా తీసుకుని ఈ వడ్డీ రేట్లు ఖరారు చేస్తారు. ఈ వడ్డీని బ్యాంకులే భరిస్తాయి.
- మధ్యకాలిక (5-7 సంవత్సరాలు), దీర్ఘకాలిక (12-15 సంవత్సరాలు) డిపాజిట్లకు వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం, Reserve Bank of India (RBI)తో సంప్రదించి నిర్ణయిస్తుంది. ఈ వడ్డీని కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది.
- ఈ పథకం కింద బ్యాంకులు నగల వ్యాపారుల కోసం బంగారు లోహ రుణ (జీఎంఎల్) ఖాతాను తెరుస్తాయి.
- ఇక్కడ రుణం రూపాయిలకు బదులుగా గ్రాముల బంగారంలో కొలుస్తారు.
- ఈ పథకం ద్వారా గృహాల నుండి సేకరించిన బంగారాన్ని బ్యాంకులు స్వల్ప కాలిక ఒప్పందాల కింద నగల వ్యాపారులకు అప్పుగా ఇస్తాయి
- రుణం ఆమోదం పొందిన తరువాత, నగల వ్యాపారులు శుద్ధి కర్మాగారాల నుంచి బౌతిక బంగారాన్ని అందుకుంటారు.
- అయితే, బ్యాంకులు ఆ పరిమాణాన్ని నగల వ్యాపారి బంగారు రుణ ఖాతాలో నమోదు చేస్తారు.
