BS6 PUC Certificate Validity : వాహనదారులకు బిగ్ అలర్ట్.. పొల్యూషన్ సర్టిఫికెట్ పై కేంద్రం కీలక నిర్ణయం.. ఇక నుంచి..
BS6 PUC Certificate Validity : దేశంలోని కోట్లాది వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. BS-6 ప్రైవేట్ వాహనాల పల్యూషన్ అండర్ కంట్రోల్ (PUC) సర్టిఫికెట్ చెల్లుబాటును ఒక సంవత్సరం నుంచి మూడు సంవత్సరాలకు పెంచాలని ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసింది.
- Harish Thanniru
- Updated on- July 28, 2026 / 03:59 PM IST
BS6 PUC Certificate Validity
BS6 PUC Certificate Validity : దేశంలోని కోట్లాది వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. BS-6 ప్రైవేట్ వాహనాల పల్యూషన్ అండర్ కంట్రోల్ (PUC) సర్టిఫికెట్ చెల్లుబాటును ఒక సంవత్సరం నుంచి మూడు సంవత్సరాలకు పెంచాలని ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే కొత్త BS-6 వాహన యజమానులకు తరచూ PUC పరీక్షలు చేయించుకునే భారం తగ్గనుంది.
Also Read : Japan Earthquake : జపాన్‌లో భారీ భూకంపం.. ఊగిపోయిన భవనాలు.. వీడియోలు వైరల్.. సునామీ హెచ్చరికలు జారీ..
దేశంలోని కోట్లాది వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. భారత్ స్టేజ్-6 (BS-VI) ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న ప్రైవేట్ వాహనాలకు పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికెట్ (PUCC) చెల్లుబాటును ప్రస్తుతం ఉన్న ఒక సంవత్సరం నుంచి మూడు సంవత్సరాలకు పెంచాలని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే కొత్త BS-6 వాహన యజమానులకు ప్రతి ఏడాది పీయూసీ పరీక్ష చేయించాల్సిన అవసరం ఉండదు.
ముసాయిదా ప్రకారం.. ఆరు సంవత్సరాల లోపు ఉన్న BS-6 ప్రైవేట్ వాహనాలకు పీయూసీ సర్టిఫికెట్ ఒకసారి తీసుకుంటే మూడేళ్ల పాటు చెల్లుబాటు అవుతుంది. దీంతో వాహన యజమానులకు సమయం, ఖర్చు రెండూ తగ్గనున్నాయి. ప్రభుత్వం కూడా శుభ్రమైన ఇంజిన్ టెక్నాలజీకి ప్రోత్సాహం ఇవ్వాలని భావిస్తోంది.
పాత వాహనాలకు మాత్రం కఠిన నిబంధనలు..
6 నుంచి 10 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న BS-6 వాహనాలు ప్రతి ఏడాదికి ఒకసారి పీయూసీ సర్టిఫికెట్ పునరుద్ధరించుకోవాలి. అదేవిధంగా 10 సంవత్సరాలకుపైగా ఉన్న BS-6 వాహనాలకు ప్రతి ఆరు నెలలకు ఒకసారి పీయూసీ పరీక్ష చేయించుకోవాలని కేంద్రం పేర్కొంది. అదేవిధంగా.. BS-4 వాహనాలు కలిగిన వారు ప్రస్తుతం ఉన్నట్లుగానే ప్రతి ఆరు నెలలకు ఒకసారి పీయూసీ తప్పనిసరి చేసింది. BS-1, BS-2, BS-3 వాహనాలు కలిగిన వారు ప్రతి మూడు నెలలకు ఒకసారి పొల్యూషన్ అండర్ కంట్రోల్ పరీక్ష చేయించుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది.
బీఎస్ -6 ప్రమాణాల వాహనాలు అత్యాధునిక కాలుష్య నియంత్రణ సాంకేతికతతో తయారవుతాయి. ఇవి పాత బీఎస్-4, బీఎస్-3 వాహనాలతో పోలిస్తే చాలా తక్కువ కాలుష్యాన్ని విడుదల చేస్తాయి. అందుకే వాటి పీయూసీ చెల్లుబాటు కాలాన్ని పెంచి, పాత వాహనాలపై మాత్రం కఠిన నిబంధనలు కొనసాగించాలని కేంద్రం భావిస్తోంది. అయితే, ప్రస్తుతం అవి ముసాయిదా (డ్రాప్ట్ ) నిబంధనలు మాత్రమే.. ప్రజల అభిప్రాయాలు, అభ్యంతరాలు స్వీకరించిన తరువాత కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకొని అధికారికంగా అమలు చేస్తుంది. దీంతో ప్రస్తుతానికి ప్రస్తుతం ఉన్న పీయూసీ నిబంధనలే అమల్లో ఉంటాయి.
