Petrol-Diesel: వాహనదారులకు గుడ్ న్యూస్.. పెట్రోల్, డీజిల్ విక్రయాలపై నో లిమిట్.. ఆంక్షలు ఎత్తివేసిన కేంద్రం
దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ (Petrol-Diesel)కమర్షియల్ కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం విధించిన పరిమితులను ఎత్తివేసింది.
- V Santhosh Kumar
- Published on- June 29, 2026 / 10:45 PM IST
Central Government lifted restrictions imposed on commercial sale of petrol and diesel effective July 1
- ఇంధన కొనుగోలు ఆంక్షల ఎత్తివేత
- జులై 1 నుంచి అమల్లోకి
- సాధారణ స్థితికి చమురు సరఫరా
Petrol-Diesel: దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ కమర్షియల్ కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం విధించిన పరిమితులను ఎత్తివేసింది. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో చమురు సరఫరాకు అంతరాయం కలగడంతో జూన్ 12న జారీ చేసిన తాత్కాలిక నియంత్రణ ఉత్తర్వులను కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఉపసంహరించుకుంది. వచ్చే నెల ఒకటో తేదీ (జులై 1) నుంచి ఈ ఆంక్షల ఎత్తివేత నిర్ణయం అమల్లోకి వస్తుందని స్పష్టంచేసింది.
IPS Transfers: తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం
గతంలో ఉద్రిక్తతల కారణంగా చమురు కొరత ఏర్పడకుండా కేంద్రం ముందస్తు చర్యలు చేపట్టింది. కృత్రిమ కొరతను అరికట్టేందుకు ఒక్కో కస్టమర్ లేదా వాహనానికి రోజుకు గరిష్ఠంగా 200 లీటర్ల డీజిల్ మాత్రమే విక్రయించాలనే నిబంధన తెచ్చింది. దీనికితోడు రిటైల్ ధరలతో పోలిస్తే పరిశ్రమలకు విక్రయించే డీజిల్ (Petrol-Diesel)ధర లీటరుకు రూ.40 అధికంగా ఉండడంతో, పారిశ్రామిక అవసరాలకు ఇంధనం మళ్లించి కొన్ని చోట్ల కొరత సృష్టించారు. దీన్ని నివారించేందుకే అప్పట్లో ప్రభుత్వం తాత్కాలిక ఆంక్షలు విధించింది.
ప్రస్తుతం దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా పూర్తిగా సాధారణ స్థితికి చేరిందని కేంద్రం వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం రిటైల్ ఔట్‌లెట్లలో ఇప్పటివరకు ఉన్న అన్ని రకాల నియంత్రణలను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో జులై 1 నుంచి వినియోగదారులు, వ్యాపార సంస్థలు ఎలాంటి పరిమితులు లేకుండా ఇంధనాన్ని కొనుగోలు చేసుకోవచ్చు.
