LPC Crisis Escalates : గ్యాస్ కష్టాల వేళ కేంద్రం బంపర్ ఆఫర్లు..
LPG Crisis : కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాపై కేంద్రం ఆంక్షలు విధించింది. మరోవైపు ఈ సంక్షోభాన్ని చక్కదిద్దే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా పైపుల ద్వారా సహజ వాయువు (PNG) సరఫరా విధానాన్ని ప్రోత్సహిస్తోంది.
- Harishth Thanniru
- Published On : March 26, 2026 / 01:44 PM IST
LPG Cylinder New Rule
- పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు
- గ్యాస్ కష్టాల వేళ కేంద్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్లు..
- పీఎన్‌జీ సరఫరాను ప్రోత్సహించేందుకు చర్యలు
LPC Crisis Escalates : పశ్చిమాసియాలో ఉద్రిక్తలతో ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన గ్యాస్ కొరత ఏర్పడింది. భారత్ పైనా ఈ ప్రభావం ఉంది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాపై కేంద్రం ఆంక్షలు విధించింది. మరోవైపు ఈ సంక్షోభాన్ని చక్కదిద్దే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా పైపుల ద్వారా సహజ వాయువు (PNG) సరఫరా విధానాన్ని ప్రోత్సహిస్తోంది. ఎల్పీజీ గ్యాస్ నుండి దీనికి మారేలా పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
Also Read : Chicken Shops : చికెన్ ప్రియులకు బిగ్ అలర్ట్.. ఏప్రిల్ 1నుంచి చికెన్ షాపులు బంద్.. కారణాలు ఇవే..
మార్కెటింగ్, ఆయిల్ రిఫైనరీ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ మాట్లాడుతూ.. పీఎన్‌జీతో పోల్చితే మన దేశం ఎల్పీజీ దిగుమతులపై అధికంగా ఆధారపడి ఉందని పేర్కొన్నారు. పీఎన్‌జీ వైపు ప్రభుత్వం మొగ్గుచూపుతోందని, అందువల్ల సాధ్యమైన చాలాచోట్ల గ్యాస్ వినియోగదారులు పీఎన్‌జీకి మారేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని అన్నారు. ఈ క్రమంలో కంపెనీలు రూ.500 వరకు ఉచిత గ్యాస్, కొత్త PNG కనెక్షన్‌లకు సెక్యూరిటీ డిపాజిట్లను తొలగించడం వంటి ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందిస్తుంది.
పీఎన్‌జీ కనెక్షన్లు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లోని గృహాలకు రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా తెలియజేసి, మారడానికి మూడు నెలల గడువు ఇస్తున్నారు. ఇప్పటికే సుమారు 2.2 లక్షల మంది వినియోగదారులు పీఎన్జీలోకి మారినట్లు, ఈ ప్రక్రియ వేగవంతం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఢిల్లీ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఓ నోటిఫికేషన్ లో రోడ్దు పునరుద్దరణ చార్జీలను మాఫీ చేయడంతోపాటు, పీఎన్జీ సంబంధిత ప్రాజెక్టులకు నిరంతరం పనిచేయడానికి అనుమతినిస్తూ దరఖాస్తు ప్రక్రియను క్రబద్దీకరించింది.
పీఎన్‌జీ దేశీయంగానే ఉత్పత్తి అవుతోంది. ఇది వైవిధ్యభరితమైన సరఫరా మార్గాల ద్వారా లభించే సౌకర్యవంతమైన ప్రత్యామ్నాయం. పైప్‌లైన్ ద్వారా వంటగదికి పీఎన్‌జీని నిరంతరాయంగా సరఫరా చేస్తారు. పీఎన్‌జీ అనుమతులను వేగవంతం చేయాలని తాజా ఉత్తర్వులో ప్రభుత్వం ఆదేశించింది.
మరోవైపు.. దేశంలో ఎల్పీజీ కొరత లేదని ప్రభుత్వం పేర్కొంది. సరఫరా స్థిరంగా కొనసాగుతుందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. గ్యాస్ కొరత ఉందంటూ వస్తున్న వందంతులను ప్రజలు నమ్మొద్దని కేంద్ర ప్రభుత్వం సూచించిన విషయం తెలిసిందే. బ్లాక్ మార్కెటింగ్ పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా సుమారు 2,700 చోట్ల దాడులు నిర్వహించి దాదాపు 2వేల సిలీండర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
