Delimitation Bill: కేంద్రం అనూహ్య నిర్ణయం.. ఈ దఫా డీలిమిటేషన్ లేనట్టే? మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా పక్కకే!

కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న నియోజకవర్గాల పునర్విభజన(Delimitation Bill), మహిళా రిజర్వేషన్ బిల్లులను ప్రస్తుతానికి పక్కనపెట్టినట్లు తెలుస్తోంది.

Centre delays delimitation and women reservation bill in parliament monsoon session

  • డీలిమిటేషన్, మహిళా బిల్లులు వాయిదా
  • రాజకీయ అననుకూల పరిస్థితులే కారణం
  • పార్లమెంట్ ఎజెండాలో లేని బిల్లులు

Delimitation Bill: కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న నియోజకవర్గాల పునర్విభజన (Delimitation Bill), మహిళా రిజర్వేషన్ బిల్లులను ప్రస్తుతానికి పక్కనపెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనే ఈ రెండు కీలక బిల్లులను ఆమోదింపజేసుకోవాలని కేంద్రం మొదట భావించింది. అయితే, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు అనుకూలంగా లేవని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

CJP Party: సీజేపీ పార్టీ కోటి విరాళంపై అనుమానాలు.. అభిజిత్ దీప్కే తండ్రి ఆర్థిక పరిస్థితిపై విచారణ.. దర్యాప్తుకు డిమాండ్

మారిన రాజకీయ సమీకరణాలు – ప్రభుత్వం వెనకడుగు?

దేశంలో ఏర్పడిన నూతన రాజకీయ పరిణామాలు, జెన్ జీ ఉద్యమం నేపథ్యంలోనే కేంద్రం ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. బెంగాల్ ఎన్నికల అనంతరం తృణమూల్ కాంగ్రెస్ నుండి విడిపోయిన కొందరు ఎంపీలు ఎన్డీఏకు మద్దతు ఇవ్వడం, ఉద్ధవ్ థాకరే వర్గానికి చెందిన పలువురు ఎంపీలు ఏక్‌నాథ్ షిండే శివసేనలో చేరడం, అలాగే ఇండియా కూటమి నేత శరద్ పవార్ ప్రధాని మోదీతో భేటీ కావడం వంటి అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ పరిణామాల మధ్యే బిల్లులను వాయిదా వేయడమే శ్రేయస్కరమని భావిస్తున్నారు.

వచ్చే వారం ఎజెండాలో స్థానం లేదు – నిరవధిక వాయిదాకు చాన్స్!

వచ్చే వారం పార్లమెంట్‌లో చర్చించబోయే ఎజెండా జాబితాలో ఈ రెండు బిల్లులకు చోటు కల్పించలేదని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. మిగిలిన ఇతర ముఖ్యమైన బిల్లులను వేగంగా ఆమోదింపజేసుకొని, సభను నిరవధికంగా వాయిదా వేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. దీంతో ఈ సమావేశాల్లో పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల ప్రక్రియ ముందడుగు పడటం కష్టమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.