PM security breach: మరోసారి తెరపైకి పీఎం భద్రతా లోపం.. చర్యలపై పంజాబ్‭ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కేంద్రం

మోదీ కాన్వాయ్ ముందుకు కదిలే పరిస్థితి లేకపోయింది. సుమారు 20 నిమిషాల పాటు ఆయన కాన్వాయ్ రోడ్డుపైనే అగిపోయింది. అనంతరం మోదీ ఢిల్లీకి వెనుదిరిగారు. ఈ ఘటనపై కేంద్ర హోం శాఖ సీరియస్ అయింది. భద్రతా లోపంపై వివరణ ఇవ్వాలని అప్పటి పంజాబ్ సీఎం చరణజిత్ సింగ్ చన్నీని ఆదేశించింది

PM security breach: గత ఏడాది జనవరిలో పంజాబ్‌ పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భద్రతలో తలెత్తిన లోపం అంశం మరోసారి తెరపైకి వచ్చింది. భద్రతా వైఫల్యంపై పంజాబ్ ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అందుకు కారణమైన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని ఆదేశించింది. అధికారులపై చర్యల నివేదకను తమకు అందజేయాలని కోరింది. పంజాబ్ ఘటనపై విచారణకు గతంలో దేశ అత్యున్నత ధర్మాసనం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. పంజాబ్ పోలీసులు, అడ్మినిస్ట్రేటివ్ అధికారుల తప్పిదాల వల్లే సమస్య తలెత్తినట్టి కమిటీ నిర్ధారించింది.

NTK leader Seeman: చల్లారుతున్న మంటపై పెట్రోల్ పోసిన ఎన్టీకే నేత.. హిందీ మాట్లాడే వారిని తమిళనాడు నుంచి వెల్లగొడతామంటూ వివాదాస్పద వ్యాఖ్యలు

అయితే ఆ నివేదిక ఆధారంగా సదరు అధికారులపై ఇంతవరకూ తీసుకున్న చర్యలకు సంబంధించిన నివేదకను తమకు అందజేయాలని పంజాబ్ ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆదేశించింది. 2022 జనవరి 5న పంజాబ్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటించారు. ఫిరోజ్‌పూర్‌లో అభివృద్ధి ప్రాజెక్టులను ఆయన ప్రారంభించాల్సి ఉండగా.. విమాన ప్రయాణంలో భాగంగా బటిండాలో దిగారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా భారతదేశం-పాకిస్తాన్ సరిహద్దు సమీపంలోని ఫిరోజ్‌పూర్‌కు పయానమయ్యారు. వ్యవసాయ చట్టాలను కేంద్రం ఉపసంహరించుకున్న తర్వాత పంజాబ్‌కు మోదీ రావడం ఇదే తొలిసారి. అయితే ప్రధాని పర్యటనకు రైతుల ఆందోళన అడుగడుగునా అడ్డంకిగా మారింది. మోదీ పర్యటనను నిరసిస్తూ రైతులు ఎక్కడికక్కడ రోడ్లను దిగ్బంధించారు.

Punjab: గన్ కల్చర్‭పై భగ్గుమన్న మాన్ ప్రభుత్వం.. 813 గన్ లైలెన్స్‭లు రద్దు

మోదీ కాన్వాయ్ ముందుకు కదిలే పరిస్థితి లేకపోయింది. సుమారు 20 నిమిషాల పాటు ఆయన కాన్వాయ్ రోడ్డుపైనే అగిపోయింది. అనంతరం మోదీ ఢిల్లీకి వెనుదిరిగారు. ఈ ఘటనపై కేంద్ర హోం శాఖ సీరియస్ అయింది. భద్రతా లోపంపై వివరణ ఇవ్వాలని అప్పటి పంజాబ్ సీఎం చరణజిత్ సింగ్ చన్నీని ఆదేశించింది. అయితే, భారత ప్రధాని భద్రతా చర్యల్లో లోపం లేదని సీఎం వివరణ ఇచ్చారు. దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్ పడటంతో అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపి కీలక తీర్పు వెలువరించింది. ఈ ఘటనపై విచారించడానికి సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఇందు మల్హోత్రా నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్టులో అధికారుల తప్పిదం వల్లే అలా జరిగిందని పేర్కొన్నారు.

ట్రెండింగ్ వార్తలు