Braille Menu Card : దృష్టి లోపం ఉన్నవారి కోసం ప్రత్యేక మెనూ కార్డు .. హ్యపీ ఫీలవుతున్న చిన్నారులు

సాధారణంగా దృష్టి లోపం ఉన్నవారు హోటల్స్‌కి వెళ్తే ఫుడ్ ఆర్డర్ చేయాలంటే ఇతరులపై ఆధారపడి మెనూ సెలక్ట్ చేసుకుంటారు. వీరి సమస్యకు ఆ హోటల్ ఓ చక్కని పరిష్కారం చూపించింది. బ్రెయిలీ లిపిలో మెనూ కార్డులు ఉంచింది. ఎక్కడ? ఏ హోటల్?

Braille Menu Card

Braille Menu Card : దృష్టి లోపం ఉన్నవారు రెస్టారెంట్‌లో నచ్చిన ఫుడ్ ఆర్డర్ ఇవ్వడానికి మెనూ చదవాలంటే ఇబ్బంది పడతారు. ప్రింటెడ్ మెనూలే ఉండటం వారికి సవాల్‌గా మారింది. ఈ సమస్యను పరిష్కరించాలనే ప్రయత్నంలో భాగంగా ఇండోర్‌లోని ఓ రెస్టారెంట్ బ్రెయిలీ లిపిలో మెనూ కార్డ్‌లను ప్రవేశపెట్టింది. వీరు చేసిన పని వల్ల దృష్టి ఉన్న వ్యక్తులు తమకు ఇష్టమైన ఫుడ్ సెలక్ట్ చేసుకునే అవకాశం దొరికింది.

Gold kulfi : చేసేది ‘గోల్డెన్ కుల్ఫీ’ వ్యాపారం.. అతని ఒంటి నిండా బంగారం.. ఇండోర్‌లో ఓ ట్రేడర్ బాగా…. రిచ్

దృష్టి లోపం ఉన్నవారు హోటల్స్ కి వెళ్తే తమకు నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేయడానికి కుటుంబ సభ్యులు, స్నేహితులపై ఆధారఫడతారు. వారికి ఈ సమస్య నుంచి పరిష్కారం చూపే దిశగా ఇండోర్‌లోని గురుకృపా రెస్టారెంట్ వారి  సౌకర్యం కోసం బ్రెయిలీ లిపిలో మెనూ కార్డులను ప్రారంభించింది. అందులో భాగంగా ముందుగా  మహేష్ దృష్టిహిన్ కళ్యాణ్ సంఘ్ నుండి దృష్టి లోపం ఉన్న పిల్లల్ని తమ రెస్టారెంట్‌కు ఆహ్వానించింది. అక్కడికి వచ్చిన పిల్లలంతా బ్రెయిలీ లిపిలో ఉన్న మెనూ కార్డ్‌లు చెక్ చేసుకుని తమకు ఇష్టమైన ఫుడ్ ఆర్డర్ చేసుకున్నారు. రెస్టారెంట్ ఆపరేటర్లు, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీకి చెందిన యంగ్ ఇండియన్స్ గ్రూపు మధ్య జరిగిన సమావేశంలో బ్రెయిలీ లిపిలో మెనూ కార్డ్‌లు ప్రవేశపెట్టాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

దృష్టిలోపం ఉన్నవారికి వాళ్లకు నచ్చిన వాయిస్ లో ఆడియో పుస్తకాలు

రెస్టారెంట్ చేసిన ప్రయత్నంలో భాగంగా ముందుగా మహేష్ దృష్టిహిన్ కళ్యాణ్ సంఘ్ నుండి దృష్టి లోపం ఉన్న పిల్లల్ని ఆహ్వానించామని.. ఇకపై అంధుల కోసం బ్రెయిలీ స్క్రిప్ట్ కార్డ్‌లు రెస్టారెంట్‌లో అందుబాటులో ఉంటాయని యంగ్ ఇండియన్ గ్రూప్ చైర్ పర్సన్ బావా గనేదివాల్ చెప్పారు. చండీఘడ్ నుంచి బ్రెయిలీ స్క్రిప్ట్ కార్డ్‌ను ఆర్డర్ చేసినట్లు తెలుస్తోంది. ఇతర రెస్టారెంట్లు కూడా బ్రెయిలీ లిపి మెనూ కార్డ్‌లను తమ రెస్టారెంట్లలో ఉంచడానికి అంగీకరించాయట. భవిష్యత్తులో ఇతర నగరాల్లో కూడా ఇలాంటి మెనూ కార్డులు అందుబాటులోకి వస్తే దృష్టి లోపం ఉన్నవారిలో ఆత్మవిశ్వాసం నింపినట్లవుతుంది.