Cigarette Prices Hike Representative Image (Image Credit To Original Source)
Cigarette Prices Hike: స్మోకర్లకు ఇది బిగ్ షాక్ అనే చెప్పాలి. సిగరెట్ ధరలు భారీగా పెరిగాయి. వాటి ధరలు ఏ రేంజ్ లో పెరిగాయో తెలిస్తే.. పొగ రాయుళ్ల గుండెలు అదరాల్సిందే. ఈ మేరకు ఐటీసీ సంస్థ స్మోకర్లకు షాక్ ఇచ్చింది. సిగరెట్ ధరలను 19 నుంచి 41శాతానికి పెంచేసింది ఐటీసీ. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి కొత్త ఎక్సైజ్ డ్యూటీస్, ట్యాక్స్ లు అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సిగరెట్ ధరలను భారీగా పెంచుతూ ఐటీసీ నిర్ణయం తీసుకుంది.
దీంతో గోల్డ్ ప్లేక్, క్లాసిక్ కనెక్ట్, క్లాసిక్ వంటి బ్రాండ్ల సిగరెట్ ధరలు పెరిగాయి. గోల్డ్ ప్లేక్ 10 సిగరెట్ల ప్యాక్ ధర 170 రూపాయల నుంచి 240 రూపాయలకు చేరింది. అంటే ప్యాకెట్ పై 70 రూపాయలు పెరిగింది. ఒక్క సిగరెట్ 24 రూపాయలు. గతం కంటే ఒక్కో సిగరెట్ పై 7 రూపాయలు పెరిగింది.
20 పీస్ క్లాసిక్ వేరియంట్ ప్యాక్ ధర 340 రూపాయల నుంచి 480 రూపాయలకి పెరిగింది. అంటే ప్యాకెట్ పై 140 రూపాయలు పెరిగింది. ఒక్క సిగరెట్ ధర 24 రూపాయలు.
ఇక సూపర్ స్టార్ వాల్యూ (10 సిగరెట్ల ప్యాక్) 59 రూపాయల నుంచి 70 రూపాయలకి పెరిగింది. అంటే ప్యాకెట్ పై 11 రూపాయలు పెరిగింది. ఒక్క సిగరెట్ ధర 7 రూపాయలకు చేరింది.
సిగరెట్ ధరలు ఒకేసారి ఈ రేంజ్ లో పెరగటం ఇదే తొలిసారి అంటున్నారు వ్యాపారులు. గతంలో రూపాయి లేదా 2 రూపాయలు మాత్రమే పెరిగిందని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు మాత్రం ఒక్క సిగరెట్ పైనే 4 నుంచి 5 రూపాయలు పెరిగిందని వివరించారు.
కాగా, ఫిబ్రవరి 1వ తేదీ నుంచి పాన్ మసాలా, పొగాకు ఉత్పత్తులపై కొత్త జీఎస్టీ రేట్లు అమల్లోకి వచ్చాయి. పాన్ మసాలాపై 40శాతం జీఎస్టీతో పాటు సెస్ విధించారు. అటు పొగాకు ఉత్పత్తులపై అదనంగా ఎక్సైజ్ డ్యూటీ అమలైంది.
జీఎస్‌టీ సంస్కరణల తర్వాత దేశంలో సిగరెట్ ధరల పెరుగుదల మొదలైంది. సిన్ గూడ్స్‌పై జీఎస్‌టీని 28 శాతం నుండి 40 శాతానికి పెంచారు. ఆ తర్వాత ఎక్సైజ్ సుంకం ఒక్క స్టిక్‌కు దాదాపు రూ. 2 నుండి రూ. 11 వరకు పెరిగింది. మొత్తం ప్యాక్ ధరలు 15 శాతం పెరిగి 40 శాతానికి చేరుకున్నాయి. గాడ్‌ఫ్రే ఫిలిప్స్ ఇండియా సహా ఇతర పొగాకు కంపెనీలు కూడా సిగరెట్ ధరలను సవరించాయి.
సిగరెట్ అలవాటు ఉన్నవారు పెరిగిన ధరలతో బెంబేలెత్తిపోతున్నారు. అటు జేబులు గుల్ల చేసుకోలేక.. ఇటు సిగరెట్ తాగటం మానలేక ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు.
Also Read: బంగారం కొనేవారికి భారీ గుడ్‌న్యూస్.. అమెరికా దెబ్బతో ధర ఢమాల్.. తులం రేటు ఎంతంటే?