తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఢిల్లీ ఎన్నికల ఫలితాల గురించి ముందే చెప్పారు. ఢిల్లీలో పిచ్చోడ్ని అడిగినా.. ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్‌కే ఓట్లు వేస్తా అంటున్నారని అప్పుడే బీజేపీ భవితవ్యాన్ని నిర్దేశించారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల విజయం తర్వాత సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. బీజేపీ పాలనా తీరుపై అనుమానం వ్యక్తం చేశారు.
జార్ఖండ్ లో రామమందిరం అని చెప్పారు కానీ, దాని నిర్మాణం గురించి ప్రశ్నించారు. అదే సందర్భంగా మాట్లాడుతూ.. సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్ ఎవరికి ఉపయోగం, ఇప్పుడు అంతా కలసి బతకడం లేదా.. డెమొక్రటిక్ దేశంలో ఈ పనులు ఏంటి. పేదరికం, నిరుద్యోగం, అనారోగ్యం సమస్యలు ఉన్నాయి. కోట్ల మందిని బాధపెట్టడం సరికాదు.
ఇక బీజేపీ స్వభావం మార్చుకోదా.. స్వతహాగా ఒప్పుకుని విరమించుకోవాలి. లేదంటే దేశం స్వభావమే మారిపోతుంది. ఇప్పటికే మతతత్వ దేశంగా పిలుస్తున్నారు. CAAపై దేశం అట్టుడికిపోతుంటే మొండిపట్టుదల ఎందుకని చూపిస్తున్నారు. దేశం మునిగిపోయే పరిస్థితి ఉంటే మౌనం పాటించడం దేశ భవిష్యత్ కు మంచిది కాదు. వంద శాతం ఇది తప్పుడు బిల్లు. ఈ ఆలోచన తప్పు. విజ్ఞతతో విరమించుకోవాలని సూచించారు.
కొద్ది నెలల ముందే చెప్పిన ఫలితాలు ఢిల్లీ ఎన్నికల్లో నిజమయ్యాయి. ఆప్‌కు బంపర్ మెజార్టీ దక్కడంతో కాంగ్రెస్ కూడా హర్షం వ్యక్తం చేస్తుంది. తమ ఓటమి అటుంచి బీజేపీ ఘోర పరాజయానికి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు.