Yogi Adityanath: 1947 నాటి ఘోరానికి కాంగ్రెస్ దే బాధ్యత.. మోడీ ప్రధానిగా ఉండుంటే.. సీఎం యోగి సంచలన కామెంట్స్
1947 దేశ విభజన అనంతరం చోటుచేసుకున్న భయానక హింసకు కాంగ్రెస్ పార్టీయే పూర్తి బాధ్యతని యోగి ఆదిత్యనాథ్(Yogi Adityanath) తీవ్ర విమర్శలు చేశారు.
- V Santhosh Kumar
- Published on- August 14, 2026 / 07:04 PM IST
Cm yogi adityanath slams congress over partition and vote bank politics
- విభజన హింసకు కాంగ్రెసే కారణం
- అధికార దాహంతో మూల్యం చెల్లించాం
- మోడీ ఉంటే విభజన జరిగేది కాదు
Yogi Adityanath: 1947 భారత దేశ విభజన అనంతరం చోటుచేసుకున్న భయానక హింసకు, నష్టానికి కాంగ్రెస్ పార్టీయే పూర్తి బాధ్యత వహించాలని ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath)తీవ్ర విమర్శలు చేశారు. లక్నోలో శుక్రవారం జరిగిన ఒక కార్యక్రమంలో స్వాతంత్య్రం, దేశ విభజన నాటి చారిత్రక పరిణామాలపై ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ నాయకుల అధికార దాహం, పిరికితనం వల్లే దేశం ఇంతటి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని ఆయన ఆరోపించారు.
Telangana Police: తెలంగాణ పోలీసులకు కేంద్ర పతకాల పంట.. గ్రేహౌండ్స్ వీరులకు శౌర్య పురస్కారాలు
మోడీ, పటేల్ ప్రధానిగా ఉండి ఉంటే విభజన జరిగేది కాదు:
స్వాతంత్య్రం వచ్చిన సమయంలో నరేంద్ర మోడీ గనుక ప్రధానిగా ఉండి ఉంటే దేశానికి ఇంతటి తీవ్ర నష్టం జరిగి ఉండేది కాదని యోగి అన్నారు. ఒకవేళ సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రధానిగా ఉన్నా కూడా భారత్ విభజనకు గురయ్యేది కాదని వ్యాఖ్యానించారు. విభజన సమయంలో పాకిస్తాన్ అడగని ప్రాంతాలను కూడా అప్పగించారని, సింధ్, పంజాబ్‌లతో పాటు బెంగాల్‌లో హిందువులు అధికంగా ఉన్న గ్రామాలను బలవంతంగా ఇచ్చేశారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు.
కుల, ప్రాంత విభేదాలు భారత్‌ను బలహీనపరిచాయి:
బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు జరిగినప్పుడు తమ ఓటు బ్యాంక్ దెబ్బతింటుందనే భయంతో కాంగ్రెస్ మౌనం వహించిందని యోగి విమర్శించారు. దేశంలో కులం, ప్రాంతం, భాష ఆధారంగా ఏర్పడిన అంతర్గత విభేదాలే భారత్‌ను బలహీనపరిచాయని, ఇటువంటి భేదాభిప్రాయాలు ఉన్నప్పుడే విదేశీ కుట్రలకు సులభంగా అవకాశం దొరుకుతుందని చెప్పారు. ఐక్యంగా ఉన్నప్పుడే దేశం శక్తివంతంగా తయారవుతుందని ఆయన ఉద్ఘాటించారు.
