LPG Price : బడ్జెట్ వేళ.. సామాన్యులకు బిగ్ షాకిచ్చిన గ్యాస్ సిలీండర్ ధరలు.. ఎంత పెరిగాయంటే..?
LPG Price : ఒకవైపు కమర్షియల్ సిలిండర్ ధరలు భయపెడుతున్నా, గృహిణులకు మాత్రం ఒక తీపి కబురు అందిందనే చెప్పాలి. ఇళ్లలో వాడే 14.2 కిలోల డొమెస్టిక్ LPG సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు.
- Harishth Thanniru
- Published On : February 1, 2026 / 08:31 AM IST
LPG Price
- పెరిగిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర
- 19కేజీ వాణిజ్య సిలిండర్ ధరపై రూ.50 పెంపు
- బడ్జెట్ వేళ సామాన్యులకు బిగ్ షాక్
LPG Price : కేంద్ర ప్రభుత్వం ఇవాళ పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ఆదివారం ఉదయం 11గంటలకు పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అయితే, కేంద్ర బడ్జెట్ వేళ సామాన్యులకు బిగ్ షాక్ తగిలింది. గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి.
Also Read : Sunetra Pawar: మహారాష్ట్ర తొలి మహిళా డిప్యూటీ సీఎంగా సునేత్ర పవార్ ప్రమాణ స్వీకారం.. ఎవరీ సునేత్ర పవార్
ప్రతీనెలా 1వ తేదీన గ్యాస్ సిలీండర్ ధరల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. అంతర్జాతీయ ముడి చమురు ధరలపై వీటి ధరలు ఆధారపడి ఉంటాయి. ప్రతీనెల 1వ తేదీన ధరలను సవరించే ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఇవాళ ఎల్పీజీ (LPG) వినియోగదారులకు షాక్ ఇచ్చాయి. కమర్షియల్ సిలిండర్ ధరను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి.
19కేజీ వాణిజ్య సిలిండర్ ధరపై రూ.50 పెరిగింది. ఈ పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ.1740.50కి చేరుకుంది. అయితే, గృహ వినియోగదారులు వినియోగించే డొమెస్టిక్ (14.2కేజీల) వంటగ్యాస్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు.
అయితే, తాజాగా వాణిజ్య సిలిండర్ గ్యాస్ ధరల పెంపుద్వారా సామాన్య ప్రజలపై భారం పడనుంది. ఈ వాణిజ్య సిలిండర్ ధర పెంపు వల్ల సామాన్యులకు ఇబ్బందిలేదని అనుకోవద్దు. ఈ వాణిజ్య సిలిండర్లను హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాలు, క్యాంటీన్లు, బేకరీలు, ఫుడ్ స్టాల్స్ లో వాడతారు. అలాగే రకరకాల చిరుతిళ్లు తయారు చేసే కంపెనీల్లో వాడతారు. ఇతర వాణిజ్య అవసరాల కోసం కూడా వాడతారు. ఇప్పుడు వారిపై ఈ భారం పడుతుంది. కానీ, వాళ్లు ఈ భారాన్ని కస్టమర్లపై వేసేందుకు ప్రయత్నిస్తారు. దీంతో ధరల భారం సామాన్యులపై పడుతుంది.
కొత్త ధరలు ఇలా..
19కేజీల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర ఢిల్లీలో ప్రస్తుతం రూ.1,740.50కి చేరింది. ఇది వరకు ఈ ధర రూ.1,690.50 ఉండేది. అలాగే కోల్ కతాలో పెరిగిన ధర రూ.1,844.50కి చేరింది. చెన్నైలో కొత్త ధర రూ.1,899.50గా ఉంది. అలాగే ముంబైలో కొత్త ధర రూ.1,692కు చేరింది. నిన్నటి వరకు అక్కడ వాణిజ్య గ్యాస్ సిలీండర్ ధర రూ.1642.50గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో..
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రముఖ ప్రాంతాల్లో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు వివరాలు చూస్తే.. హైదరాబాద్ లో రూ.905, వరంగల్ లో రూ.924, విశాఖపట్టణంలో రూ.861, విజయవాడలో రూ.875, గుంటూరు రూ.877కు చేరింది.
గృహిణులకు భారీ ఊరట..
ఒకవైపు కమర్షియల్ సిలిండర్ ధరలు భయపెడుతున్నా, గృహిణులకు మాత్రం ఒక తీపి కబురు అందిందనే చెప్పాలి. ఇళ్లలో వాడే 14.2 కిలోల డొమెస్టిక్ LPG సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. ప్రస్తుతం ఢిల్లీలో డొమెస్టిక్ సిలిండర్ ధర రూ. 853 గా ఉండగా, హైదరాబాద్ వంటి నగరాల్లో కూడా దాదాపు అదే స్థాయిలో స్థిరంగా ఉంది. గత ఏడాది ఏప్రిల్ నుంచి గృహ అవసరాల సిలిండర్ల ధరలు పెరగకపోవడం మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద ఊరటనిస్తోంది.
