LPG Cylinder Price Cut : గ్యాస్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన ఎల్పీజీ సిలిండర్ల ధరలు

Commercial LPG Cylinder Price Cut : గ్యాస్ వినియోగదారులకు శుభవార్త. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర భారీగా తగ్గింది.

Commercial LPG Cylinder Price Cut

  • గ్యాస్ వినియోగదారులకు శుభవార్త
  • భారీగా తగ్గిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు
  • అమల్లోకి వచ్చిన కొత్త ధరలు

Commercial LPG Cylinder Price Cut : గ్యాస్ వినియోగదారులకు శుభవార్త. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర భారీగా తగ్గింది. అయితే, గృహ వినియోగదారులు వినియోగించే 14.2కేజీల సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు.

Also Read : Telangana Sir Survey: తెలంగాణ ఓటర్లకు బిగ్ అలర్ట్.. SIR సవరణ గడువు పొడిగింపు

హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర వాణిజ్య సంస్థలకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. గత కొన్ని నెలలుగా వరుసగా పెరుగుతున్న 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ (LPG) సిలిండర్ ధరలను ఆగస్టు 1 నుంచి రూ.200కుపైగా తగ్గించింది. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వచ్చినట్లు చమురు మార్కెటింగ్ సంస్థలు వెల్లడించాయి.

తాజా సవరణ ప్రకారం.. ఢిల్లీలో కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.202 తగ్గగా, కోల్‌కతాలో రూ.209 తగ్గింది. దీంతో కోల్‌కతాలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ.2,872.50కు చేరింది. ఢిల్లీలో రూ.2,728కు చేరింది. ఈ ధరల తగ్గింపు హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్ సంస్థలు వంటి వ్యాపార వర్గాలకు ఉపశమనం కలిగించనుంది.

ఇరాన్ యుద్ధం, పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ఎల్పీజీ ధరలు పెరగడంతో గత కొన్ని నెలలుగా కమర్షియల్ సిలిండర్ల ధరలు వరుసగా పెరిగాయి. అయితే జూలైలో ప్రారంభమైన తగ్గింపు ఆగస్టులోనూ కొనసాగడం విశేషం.ఢిల్లీలో రెండు నెలల్లో కమర్షియల్ సిలిండర్ల ధర రూ.375.50 మేర తగ్గింది.

మరోవైపు 14.2 కిలోల గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు చోటుచేసుకోలేదు. గృహ వినియోగదారులు ప్రస్తుతం ఉన్న ధరలకే గ్యాస్ సిలిండర్‌ లభించనుంది.