Sonia Gandhi : సోనియాకు చేదు అనుభవం.. జారిపడ్డ జెండా
కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ పార్టీ జెండా ఎగరవేసేందుకు ప్రయత్నించారు.. ఈ సమయంలోనే తాడు తెగడంతో పార్టీ జెండా ఆమె చేతుల్లో పడింది
- kunduru Vinod
- Published On : December 28, 2021 / 11:58 AM IST
Sonia Gandhi
Sonia Gandhi : భారత జాతీయ కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ పార్టీ జెండా ఎగరవేసేందుకు ప్రయత్నించారు.. ఈ సమయంలోనే తాడు తెగడంతో పార్టీ జెండా ఆమె చేతుల్లో పడింది. కాంగ్రెస్ 137వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో భాగంగా మంగళవారం ఉదయం ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జెండాను ఎగరవేసిన సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది.
చదవండి : T Congress: తెలంగాణ కాంగ్రెస్ లో భగ్గుమన్న విభేదాలు
సేవాదళ్ కార్యకర్తలకు పాదాభివందనం చేసిన అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం సోనియా గాంధీ పార్టీ జెండాను ఎగరవేశారు. స్తంభంపై జెండా ఎగరవేయగానే తాడు తెగిపడి జెండా పడిపోయింది. సేవాదళ్ కార్యకర్తలు జెండా స్తంభం పైకి ఎక్కి జెండాను పునరుద్ధరించేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఇక జెండా వందనం జరగకుండానే కార్యక్రమాన్ని ముగించేశారు. ఇక ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులతోపాటు నేతలు ఏఐసీసీ కార్యాలయానికి వచ్చారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ కూడా హాజరయ్యారు
చదవండి : T.Congress : డి.శ్రీనివాస్ కొడుకు కూడా కాంగ్రెస్ లో చేరాలి – వీహెచ్
#WATCH | Congress flag falls off while being hoisted by party’s interim president Sonia Gandhi on the party’s 137th Foundation Day#Delhi pic.twitter.com/A03JkKS5aC
— ANI (@ANI) December 28, 2021
