Congress YouTube channel: కాంగ్రెస్ యూట్యూబ్ ఛానల్ డిలీట్

ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం స్పందిస్తూ ‘‘మా యూట్యూబ్ ఛానల్ ‘ఇండియన్ నేషనల్ కాంగ్రెస్’ తొలగించబడింది. ఈ విషయమై మేము గూగుల్/యూట్యూబ్ బృందాలతో చర్చిస్తున్నాము. సాంకేతిక లోపంతో ఇలా జరిగిందా? లేదంటే మరింకేదైనా కారణముందా అనేది పరిశోధిస్తున్నాము. మేము తొందరలోనే మళ్లీ యూట్యూబ్‭కి వస్తాము’’ అని ట్వీట్ చేశారు.

Congress YouTube channel: కాంగ్రెస్ పార్టీకి చెందిన అధికారిక యూట్యూబ్ ఛానల్ డిలీట్ అయిందని ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం ప్రకటించింది. సాంకేతిక కారణాల వల్ల డిలీట్ అయి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ.. కచ్చితమైన కారణాలేంటో ఇప్పుడు చెప్పలేమని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. కొంత కాలంగా బీజేపీకి పోటీగా సోషల్ మీడియా విభాగాన్ని నిర్మించుకుంటోంది కాంగ్రెస్ పార్టీ. కాగా, మరికొద్ది రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కీలక నేత ‘భారత్ జోడో యాత్రా’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించనున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో యూట్యూబ్ ఛానల్ డిలీట్ అవ్వడం కాస్త ఇబ్బందికరమే అంటున్నారు.

ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం స్పందిస్తూ ‘‘మా యూట్యూబ్ ఛానల్ ‘ఇండియన్ నేషనల్ కాంగ్రెస్’ తొలగించబడింది. ఈ విషయమై మేము గూగుల్/యూట్యూబ్ బృందాలతో చర్చిస్తున్నాము. సాంకేతిక లోపంతో ఇలా జరిగిందా? లేదంటే మరింకేదైనా కారణముందా అనేది పరిశోధిస్తున్నాము. మేము తొందరలోనే మళ్లీ యూట్యూబ్‭కి వస్తాము’’ అని ట్వీట్ చేశారు.

Rajasthan: రాజస్థాన్‌లో మరో దళిత విద్యార్థిపై టీచర్ దాడి.. స్పృహ తప్పిన విద్యార్థి

ట్రెండింగ్ వార్తలు