Rajasthan: రాజస్థాన్‌లో మరో దళిత విద్యార్థిపై టీచర్ దాడి.. స్పృహ తప్పిన విద్యార్థి

దళిత విద్యార్థిపై టీచర్ దారుణంగా దాడి చేశాడు. తలకు బలమైన గాయం కావడంతో ఏడో తరగతి చదువుతున్న విద్యార్థి స్పృహ కోల్పోయాడు. వెంటనే తల్లిదండ్రులు అతడిని ఆస్పత్రికి చేర్చి చికిత్స అందిస్తున్నారు.

Rajasthan: రాజస్థాన్‌లో మరో దళిత విద్యార్థిపై టీచర్ దాడి.. స్పృహ తప్పిన విద్యార్థి

Rajasthan: ఇటీవలే రాజస్థాన్‌లో టీచర్ దాడి చేయడంతో ఒక దళిత విద్యార్థి మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే మరో దళిత విద్యార్థిపై టీచర్ దాడి చేసిన ఘటన రాజస్థాన్‌లోనే జరిగింది. టీచర్ కొట్టడంతో గాయపడ్డ బాలుడు స్పృహతప్పి పడిపోయాడు. ఈ ఘటన తాజాగా బర్మార్ జిల్లాలో జరిగింది.

Nitish Kumar: విశ్వాస పరీక్షలో నెగ్గిన నితీష్ కుమార్.. బీజేపీపై విమర్శలు

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక పాఠశాలలో బాధిత విద్యార్థి ఏడో తరగతి చదువుతున్నాడు. బాలుడిని అశోక్ మాలి అనే టీచర్ దారుణంగా కొట్టాడు. క్లాసు రూములో గోడకు నిలబెట్టి, విద్యార్థిపై దాడి చేయడంతో అతడి తలకు తీవ్రగాయాలయ్యాయి. అదే తరగతిలో చదువుతున్న అతడి సోదరుడు వెంటనే పరుగెత్తుకుంటూ వెళ్లి, మరో టీచర్‌కు విషయం చెప్పాడు. వెంటనే అందరూ తరగతి గదిలోకి వెళ్లేసరికి టీచర్ దాడి చేస్తున్నాడు. అప్పుడు ఆ దాడిని ఆపి, ఇద్దరు పిల్లల్ని ఇంటికి పంపించింది ఆ టీచర్. అయితే ఇంటికి చేరుకున్న తర్వాత గాయపడ్డ బాలుడు కడుపునొప్పి, తలనొప్పి అంటూ స్పృహ తప్పిపడిపోయాడు. తలకు బలమైన గాయం కావడం వల్ల అతడు స్పృహ తప్పిపడిపోయాడు.

Kapil Dev: ఆ మ్యాచ్ గురించి గుర్తొస్తే.. ఇప్పటికీ నిద్ర పట్టదు: కపిల్ దేవ్

వెంటనే బాలుడి కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థికి అక్కడ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఘటనపై తల్లిదండ్రుల ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బాధ్యుడైన అశోక్ మాలి అనే టీచర్‌ను అరెస్టు చేశారు. విద్యాశాఖ కూడా ఈ అంశంపై దర్యాప్తు జరుపుతోంది.