Nitish Kumar: విశ్వాస పరీక్షలో నెగ్గిన నితీష్ కుమార్.. బీజేపీపై విమర్శలు

బిహార్ అసెంబ్లీలో బుధవారం జరిగిన విశ్వాస పరీక్షలో నితీష్ కుమార్ విజయం సాధించారు. 243 స్థానాలున్న అసెంబ్లీలో నితీష్.. 160 సీట్ల మెజారిటీ సాధించారు. అయితే, విశ్వాస పరీక్షకు ముందే బీజేపీ సభ నుంచి వాకౌట్ చేసింది.

Nitish Kumar: విశ్వాస పరీక్షలో నెగ్గిన నితీష్ కుమార్.. బీజేపీపై విమర్శలు

Nitish Kumar: బిహార్ అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో సీఎం నితీష్ కుమార్ విజయం సాధించారు. బుధవారం సాయంత్రం జరిగిన ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో బల పరీక్ష నిర్వహించారు. దీనిలో నితీష్ మెజారిటీ సాధించారు. బీజేపీకి దూరమైన నితీష్ కుమార్ (జేడీయూ).. తేజస్వి యాదవ్ (ఆర్జేడీ), కాంగ్రెస్, ఇతర పక్షాలతో కలిసి ‘మహాఘాత్ బంధన్’ పేరుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

Odisha school: స్కూలు ఫీజు చెల్లించలేదని విద్యార్థుల్ని లైబ్రరీలో బంధించిన యాజమాన్యం.. తల్లిదండ్రుల ఆగ్రహం

కొత్త ప్రభుత్వం బుధవారం విశ్వాస పరీక్షను ఎదుర్కొంది. విశ్వాస పరీక్షకు ముందే బీజేపీ సభ నుంచి వాకౌట్ చేసింది. 243 ఎమ్మెల్యే స్థానాలున్న అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 123 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. అయితే, నితీష్ తాజా విశ్వాస పరీక్షలో 160 మంది ఎమ్మెల్యేల ఓట్లు సాధించారు. మెజారిటీ కంటే భారీగా ఓట్లు సాధించి విశ్వాస పరీక్షలో నెగ్గారు. సీఎంగా నితీష్ కుమార్ పదవి చేపట్టడం ఇది ఎనిమిదోసారి. విశ్వాస పరీక్షకు మహేశ్వర్ హజారి స్పీకర్‌గా వ్యవహరించారు. విశ్వాస పరీక్ష సందర్భంగా సభలో నితీష్ కుమార్ మాట్లాడుతూ.. బీజేపీపై విమర్శలు గుప్పించారు. ‘‘2020 ఎన్నికల గురించే బీజేపీ మాట్లాడొద్దు. అంతకుముందు జరిగిన ఎన్నికల్లో బీజేపీకన్నా, జేడీయూనే ఎక్కువ సీట్లు గెలుచుకున్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.

Kapil Dev: ఆ మ్యాచ్ గురించి గుర్తొస్తే.. ఇప్పటికీ నిద్ర పట్టదు: కపిల్ దేవ్

పాట్నా యూనివర్సిటీకి కేంద్ర హోదా కల్పించాలని కోరినా ప్రభుత్వం పట్టించుకోలేదు. వాజ్‌పేయి, అద్వానీ లాంటి నేతలు నన్నెంతో గౌరవంగా చూసేవారు. ఈ రోజు ఢిల్లీలో బయట జరుగుతున్నదంతా పబ్లిసిటీయే. అసలు భారత స్వాతంత్ర్యంలో బీజేపీ ఎక్కడుంది. పత్రికలను కూడా స్వతంత్రంగా పనిచేయనివ్వడం లేదు. సమాజంలో అలజడి సృష్టించడమే బీజేపీ లక్ష్యం. మార్పు కోసం అందరూ కలిసి పని చేయాల్సిన అవసరం ఉంది’’ అని నితీష్ కుమార్ వ్యాఖ్యానించారు.