Salman Khurshid : హిందుత్వను జిహాదీ గ్రూప్‌లతో పోల్చిన కాంగ్రెస్ నేత, భగ్గుమన్న బీజేపీ
కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ తన కొత్త పుస్తకంలో హిందుత్వను రాడికల్ జిహాదీ గ్రూప్‌లైన ఐఎస్ఐఎస్, బోకా హరామ్‌లతో పోల్చారు. దీనిపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. ఇస్లామిక్ జీహాద్‌తో..
- Naveen
- Updated on- November 11, 2021 / 04:37 PM IST
Salman Khurshid
Salman Khurshid : కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ పుస్తకం వివాదానికి దారి తీసింది. ఆయన తన పుస్తకంలో రాసిన కొన్ని వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా హిందుత్వ గురించి సల్మాన్ రాసిన వ్యాఖ్యలు అగ్గి రాజేశాయి.
కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ తన కొత్త పుస్తకంలో హిందుత్వను రాడికల్ జిహాదీ గ్రూప్‌లైన ఐఎస్ఐఎస్, బోకా హరామ్‌లతో పోల్చారు. దీనిపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. ఇస్లామిక్ జీహాద్‌తో హిందుత్వను ముండిపెట్టడం వెనుక ముస్లిం ఓట్లకు గాలం వేసే ఆలోచన గ్రాండ్ ఓల్డ్ పార్టీ (కాంగ్రెస్)కి ఉందని బీజేపీ సీనియర్ నేత, ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ తప్పుపట్టారు.
Best Food : మాంసాహారాన్ని మించిన ఆహారం ఇదే…
”సల్మాన్ ఖుర్షీద్ తన పుస్తకంలో హిందుత్వ కూడా ఐఎస్ఐఎస్, బోకా హరామ్ వంటి జిహాదిస్ట్ ఇస్లామిక్ గ్రూపుల వంటిదేనని రాశారు. సాఫ్రాన్ టెర్రర్, ఇస్లామిక్ జీహాద్ ఒకటేననడం ముస్లిం ఓట్లను పొందేందుకు కాకపోతే మరింకెందుకని అనుకోగలం” అని మాలవీయ ఒక ట్వీట్లో ప్రశ్నించారు.
”సన్ రైజ్ ఓవర్ అయోధ్య: నేషన్‌హుడ్ ఇన్ అవర్ టైమ్స్” అనే పేరుతో సల్మాన్ ఖాన్ రచించిన తాజా పుస్తకాన్ని ఢిల్లీలో బుధవారం ఆవిష్కరించారు. ఈ పుస్తకంలోనే 113వ పేజీలో ఆయన హిందుత్వను ఐఎస్ఐఎస్, బొకో హరామ్‌తో పోల్చారు. ”సనాతన ధర్మం, సాధువులు, రుషులు చెప్పిన క్లాసికల్ హిందూయిజాన్ని… హిందుత్వ వెర్షన్ పక్కన పెట్టేసింది. హిందుత్వ రాజకీయ వెర్షన్ ప్రమాణాలు ఐఎస్ఐఎస్, బొకోహరాం రాజకీయ వెర్షన్ ప్రమాణాలకు సామీప్యం ఉంది” అని సల్మాన్ ఖుర్షీద్ అందులో తెలిపారు.
Lose Weight : కసరత్తులు లేకుండా బరువు తగ్గటం ఎలాగో తెలుసా
కాగా, సల్మాన్ ఖుర్షీద్పై ఢిల్లీకి చెందిన వివేక్ గార్గ్ అనే న్యాయవాది క్రిమినల్ ఫిర్యాదు చేశారు. హిందుత్వను టెర్రరిజంతో పోల్చి అవమానించినందుకు ఆయనపై పోలీసులు కేసు నమోదు చేయాలన్నారు.
