Best Food : మాంసాహారాన్ని మించిన ఆహారం ఇదే…

శరీరానికి వీటి వల్ల ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు చేకూరతాయి. మాంసాహారాన్ని మించిన శాఖాహారం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్ధాం...

Best Food : మాంసాహారాన్ని మించిన ఆహారం ఇదే…

Food

Best Food : శాఖాహారం మాంసం కంటే చాలా ఆరోగ్యకరమని చాలా మందికి తెలియదు. మాంసం తింటేనే శరీరానికి కావాల్సినన్ని పోషకాలు సమకూరుతాయని అనుకుటుంటారు. అయితే ఇందులో ఏమాత్రం నిజంలేదు.  శాఖాహారంలో కూడా శరీరానికి అవసరమైన ప్రొటీన్లు, ఖనిజాలు, విటమిన్లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, ఉంటాయి. శరీరానికి వీటి వల్ల ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు చేకూరతాయి. మాంసాహారాన్ని మించిన శాఖాహారం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్ధాం…

బాదం…

శాకాహారులకు అద్భుతమైన ఆహారంగా బాదం ను చెప్పవచ్చు. ఇందులో మాంసాహారాన్ని తీసుకోవటం వల్ల అందే ప్రొటీన్ వీటిని తీసుకోవటం ద్వారా సమకూరుతుంది. చికెన్, మటన్ లు తీసుకోవటం కంటే బాదం తీసుకోవటం వల్ల ఒమేగా 9, ఒమేగా 6 మరియు ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, ఫైబర్, కాల్షియం, ఐరన్ లభిస్తాయి. బాదం తొక్కలో డైటరీ ఫైబర్ అధిక స్థాయిలో ఉంటుంది.

సోయాబీన్…

సోయాబిన్ ను ఆహారంగా తీసుకోవటం చాలా మంచిది. ఒక కప్పు ముడి చికెన్‌లో 43.43 గ్రా. ప్రోటీన్ ఉంది. అదే కప్పు సోయాబీన్‌లో 68 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. చికెన్‌తో పోలిస్తే సోయాబీన్‌లో సోయాలో ఎక్కువ పోషకాలు ఉంటాయి. ఒక కప్పు గుమ్మడికాయ గింజలో 18 గ్రాముల ఫైబర్ ఉంటుంది. గుమ్మడికాయ గింజలో అధిక స్థాయిలో ప్రోటీన్, మెగ్నీషియం, మాంగనీస్, ఫాస్పరస్, ఐరన్, జింక్ మరియు పొటాషియం ఉంటాయి.

గసగసాలు…

శరీరానికి గసగసాలు తీసుకోవటం వల్ల ప్రయోజనం చేకూరుతుంది. ఒక కప్పు గసగసాలలో 19.5 గ్రాముల డైటరీ ఫైబర్ ఉంటుంది మరియు మాంసంలో ఫైబర్ ఉండదు. మాంసాహారులు శరీరానికి ఫైబర్ కావాలంటే గసగసాలు ఉపయోగించటం వల్ల ఫలితం ఉంటుంది.

అవిసెగింజలు…

ఆరోగ్యానికి అవిసెగింజలు ఎంతో మేలు చేస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. ఈ గింజల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.అవిసె గింజల పొడిని రోజూ నీటితో కలిపి తీసుకోవచ్చు. ఇది మీ శరీరానికి అవసరమైన ఫైబర్‌ను అందిస్తుంది.