Tamil Nadu : చెన్నైలో మళ్లీ కంటోన్మెంట్ జోన్‌‌లు!

ఒకే వీధిలో ముగ్గురు కరోనా బారిన పడితే..ఆ ప్రాంతాన్ని కంటోన్మెంట్ జోన్ ప్రకటించాలని ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో రాత్రి వేళ కర్ఫ్యూ విధించాలా ? వద్దా ? అనేది...

Tamilnadu covid

Containment Zones : గతంలో కరోనా మొదటి, రెండో వేవ్ లో ఉన్న పరిస్థితులు మళ్లీ వస్తాయా ? కరోనా కల్లోలం రెండేళ్లుగా ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తాజాగా..కొత్త వేరియంట్ ఒమిక్రాన్ రూపంలో విరుచుకపడుతోంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త వైరస్ లు రూపాంతరం చెందుతుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. భారతదేశంలో కూడా కొత్త వేరియంట్ విజృంభిస్తోంది. మళ్లీ పలు రాష్ట్రాలు ఆంక్షల వలయంలోకి వెళ్లిపోతున్నాయి. నైట్ కర్ఫ్యూలు విధిస్తున్నాయి. తాజాగా..చెన్నైలో మళ్లీ కంటోన్మెంట్ జోన్ లు ఏర్పాటు చేస్తున్నారు. తమిళనాడు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి మాసుబ్రమణియన్, ఆరోగ్య శాఖ కార్యదర్శి రాధాకృష్ణన్, చెన్నై కార్పొరేషన్ కమిషనర్ గగన్ దీప్ సింగ్ బేడీలు జోన్లను పరిశీలించారు.

Read More : BCCI President : గంగూలీ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్

ఇక్కడి కార్పొరేషన్ పరిధిలోని 39 వేల 537 వీధుల్లో 507 వీధుల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందిందని మంత్రి మా సుబ్రమణియన్ తెలిపారు. ఒకే వీధిలో ముగ్గురు కరోనా బారిన పడితే..ఆ ప్రాంతాన్ని కంటోన్మెంట్ జోన్ ప్రకటించాలని ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో రాత్రి వేళ కర్ఫ్యూ విధించాలా ? వద్దా ? అనేది 2021, డిసెంబర్ 31వ తేదీ సీఎం అధ్యక్షతనలో జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకుని తర్వాత ప్రకటిస్తామని మంత్రి తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం తరపున చర్యలు తీసుకుంటున్నట్లు, ప్రజలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు. కరోనా నిబంధనలు పాటించాలని ఆయన సూచించారు. మరోవైపు…మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు 619కి చేరుకున్నాయి. ఇందులో మూడింట ఒకవంతు కేసులు చెన్నైలో నమోదయినట్లు వైద్యులు వెల్లడిస్తున్నారు. కరోనా పరీక్షలు రెట్టింపు చేయడం జరుగుతోందని మంత్రి మా సుబ్రమణియన్ తెలిపారు.