Cooking Oil Prices: భగ్గుమంటున్న వంట నూనెల ధరలు.. ఏడాదిలో 12.8% పెరుగుదల.. రానున్న రోజుల్లో..

కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ నివేదిక ప్రకారం, గత ఏడాది కాలంలో ప్రధాన వంట నూనెల ధరలు(Cooking Oil Prices) సగటున 12.8 శాతం మేర పెరిగాయి.

Cooking oil prices have risen sharply across the country.

  • వంట నూనెల ధరలు భగ్గు
  • యుద్ధం, ఎల్నినో ప్రధాన కారణాలు
  • పండగ సీజన్ మరింత ప్రియం

Cooking Oil Prices: పండగల సీజన్ రాకముందే దేశంలో వంట నూనెల ధరలు సలసల కాగుతున్నాయి. నిత్యం వాడే నూనెల ధరలు ఆకాశాన్నంటుతుండటంతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్ తలకిందులవుతోంది. కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ (డీసీఏ) తాజా నివేదిక ప్రకారం, గత ఏడాది కాలంలో ప్రధాన వంట నూనెల ధరలు సగటున 12.8 శాతం మేర పెరిగాయి. రిటైల్ మార్కెట్లో కిలో ఆవనూనె రూ.193.54, సోయా ఆయిల్ రూ.163.10, పామాయిల్ రూ.147.37కు చేరగా, బ్రాండెడ్ సన్ఫ్లవర్ ఆయిల్ 5 లీటర్ల క్యాన్ ధర ఏకంగా రూ.1,395 వరకు పలుకుతోంది.

Kalyana Lakshmi Scheme: కల్యాణలక్ష్మి పథకంలో మార్పులు.. చెక్కుల పంపిణీ బంద్.. సర్కార్ కీలక నిర్ణయం

ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలివే:

ప్రస్తుతం వంట నూనెల ధరలు (Cooking Oil Prices)ఈ స్థాయిలో పెరగడానికి అంతర్జాతీయ పరిణామాలు, యుద్ధ సంక్షోభాలే ముఖ్య కారణం. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం వల్ల అంతర్జాతీయంగా నౌకా రవాణా, బీమా ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. వీటికి తోడు డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ క్షీణించడం, ఇండోనేషియా వంటి దేశాలు బయో ఫ్యూయల్స్ కోసం పామాయిల్‌ను భారీగా మళ్లించడం వంటి కారణాల వల్ల ముంబై రేవుకు వచ్చే దిగుమతి వ్యయం భారీగా పెరిగింది. భారత్ తన వంట నూనెల అవసరాల కోసం దాదాపు 57 నుంచి 58 శాతం దిగుమతులపైనే ఆధారపడుతుండటంతో ఈ అంతర్జాతీయ ఆటుపోట్లు దేశీయ మార్కెట్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి.

పండగల సీజన్ నాటికి మరింత ప్రియం?

రానున్న రోజుల్లో వంట నూనెల ధరలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని మార్కెట్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఎల్నినో ప్రభావం కారణంగా దేశంలోని ముఖ్యమైన నూనెగింజల సాగు ప్రాంతాలైన గుజరాత్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఖరీఫ్ సాగు దాదాపు 30 శాతం వరకు పడిపోయింది. ఈ ఏడాది దిగుమతులు కూడా 168 లక్షల టన్నులకు చేరే అవకాశం ఉందని అంచనా. అటు అంతర్జాతీయంగా సరఫరా లోటు, ఇటు దేశీయంగా ఉత్పత్తి తగ్గడం వంటి కారణాల వల్ల రాబోయే పండగల సీజన్ నాటికి వంట నూనెల సెగ మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.