భారత్‌లో కరోనా కల్లోలం.. 18కి చేరిన కేసులు

చైనాని సర్వ నాశనం చేసి ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి.. ఇప్పుడు భారత దేశంపైనా ప్రతాపం చూపిస్తోంది. భారత్ లో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకి

  • Publish Date - March 4, 2020 / 04:55 AM IST

చైనాని సర్వ నాశనం చేసి ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి.. ఇప్పుడు భారత దేశంపైనా ప్రతాపం చూపిస్తోంది. భారత్ లో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకి

చైనాని సర్వ నాశనం చేసి ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి.. ఇప్పుడు భారత దేశంపైనా ప్రతాపం చూపిస్తోంది. భారత్ లో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకి కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. మన దేశంలో బుధవారం(మార్చి 4,2020) నాటికి కరోనా కేసుల సంఖ్య 18కి చేరింది. వీరిలో ఎక్కువ మంది విదేశీయులే. 15మంది ఇటలీ టూరిస్టులకు కరోనా పాజిటివ్ అని తేలింది. వీరందరికి చావ్లాలోని ఐటీబీపీ శిబిరంలో చికిత్స అందిస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి ప్రతాపం చూపిస్తోంది. ఇప్పటివరకు 80కుపైగా దేశాల్లో కరోనా వ్యాపించింది. 90వేల మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. 3వేల 500 మంది మృత్యువాత పడ్డారు. ఇప్పటివరకు ఈ వైరస్ కు వ్యాక్సిన్ లేదు. దీంతో అంతా హడలిపోతున్నారు.

మన దేశంలోనూ కరోనా విజృంభణతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. భారత్‌లో కరోనా విస్తరించడకుండా చర్యలు చేపట్టింది. పలు దేశాల నుంచి భారత్‌లోకి ప్రవేశించేవారిపై కఠిన అంక్షలు విధిస్తోంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తక్షణమే ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని ప్రకటించింది. అంతేకాకుండా విదేశీ ప్రయాణాలపై కీలక సూచనలు చేసింది.(కరోనాతో పోరాడేందుకు చైనా గబ్బిలం సూట్లు)

మార్చి 3వ తేదీకి ముందు ఇటలీ, ఇరాన్‌, దక్షిణ కొరియా, జపాన్‌ దేశస్థులకు జారీ చేసిన రెగ్యులర్‌, ఈ వీసాలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. అత్యవసర కారణాలతో భారత్‌ రావాలనుకునే వారు సమీపంలోని భారత ఎంబసీని సంప్రదించి కొత్త వీసాలను పొందాలని సూచించింది. చైనా దేశీయులకు ఫిబ్రవరి 5కు ముందు వరకు జారీ చేసిన రెగ్యులర్‌, ఈ వీసాలను తాత్కాలికంగా రద్దు చేసింది కేంద్రం. ఆ నిర్ణయం ఇంకా కొనసాగుతుందని కొత్త నిబంధనల్లో వెల్లడించింది. అత్యవసర కారణాలతో భారత్‌ రావాలనుకునేవారు సమీపంలోని భారత ఎంబసీని సంప్రదించి కొత్త వీసాలను పొందాలని సూచించింది.
 
ఫిబ్రవరి 1 తర్వాత చైనా, ఇరాన్‌, ఇటలీ, దక్షిణ కొరియా, జపాన్‌ దేశాలకు వెళ్లిన విదేశీయుల రెగ్యులర్‌, ఈ వీసాలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఆ జాబితాలో ఎవరైనా అత్యవసర కారణాలతో భారత్‌ రావాలనుకునేవారు సమీపంలోని భారత ఎంబసీని సంప్రదించి కొత్త వీసాలను పొందాలని సూచించింది.