Corona Test: 56 ఏనుగులకు కరోనా పరీక్షలు
కరోనా లక్షణాలు జంతువుల్లో కూడా కనిపిస్తున్నాయి. కుక్కలు, పిల్లులతో సహా జూలలో ఉండే జంతువులు కూడా కరోనా బారినపడుతున్నాయి.
- kunduru Vinod
- Published On : June 9, 2021 / 10:18 AM IST
Corona Test
Corona Test: కరోనా లక్షణాలు జంతువుల్లో కూడా కనిపిస్తున్నాయి. కుక్కలు, పిల్లులతో సహా జూలో ఉండే జంతువులు కూడా కరోనా బారినపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తమిళనాడులో 56 ఏనుగులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. కోయంబత్తూరు, నీలగిరి జిల్లాల్లో 2 శిబిరాల్లోని ఏనుగులకు కరోనా పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. వీటి నమూనాలను ఉత్తరప్రదేశ్ పశు పరిశోధనా సంస్థకు పంపారు. గత కొద్దీ రోజులుగా నాలుగు ఏనుగుల ఆరోగ్య పరిస్థితిలో మార్పులు రావడంతో పరీక్షలు నిర్వహించామని వివరించారు.
కాగా తాజాగా తమిళనాడులోని చెన్నై జూపార్కులో కరోనాతో సింహం మృతి చెందిన విషయం విదితమే.. అదే పార్కులో దానితోపాటు ఉన్న మరికొన్ని సింహాలకు కూడా కరోనా సోకింది. దీంతో ఏనుగులకు కూడా పరీక్షలు నిర్వహించారు అధికారులు.
Read:Kanpur Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. 17మంది ప్రయాణికులు మృతి
