Delhi : హైవేపై బైక్ మీద వెళ్తూ ఓ జంట కౌగిలింతలు, ముద్దులు.. తిట్టిపోస్తున్న నెటిజన్లు

ఢిల్లీ ఏదో రకంగా వార్తల్లో ఉంటోంది. ఇటు మెట్రోలో యువతీ యువకులు వైరల్ వీడియోలతో హంగామా చేస్తుంటే .. మరోవైపు బైక్ మీద ఓ జంట ముద్దు పెట్టుకుంటూ అభ్యంతరకరంగా ప్రవర్తించిన ఘటన వైరల్ అవుతోంది.

Delhi

Delhi : హైవే అంటే వాహనాల రద్దీ ఏ విధంగా ఉంటుందో ఊహించగలం. అలాంటి దారిలో బైక్ మీద వెళ్తూ ముద్దులు పెట్టుకుంటూ అసభ్యకరమైన విన్యాసాలు చేస్తూ వెళ్తున్న ఓ జంట వీడియో వైరల్ అవుతోంది.

Delhi Metro : ఢిల్లీ మెట్రోలో హెయిర్ స్ట్రెయిట్ చేసుకున్నయువతి వీడియో వైరల్ .. తిట్టిపోస్తున్న నెటిజన్లు

ఘజియాబాద్‌లోని ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వేపై బైక్ మీద వెళ్తున్న ఓ జంట అభ్యంతరకరంగా ప్రవర్తించారు. కౌగిలించుకుంటూ.. ముద్దులు పెట్టుకుంటున్న వీడియో వైరల్ అవుతోంది. రోడ్డుపై వాహనాలు అతి వేగంగా వెళ్తున్న దారిలో ఈ జంట ప్రవర్తనపై నెటిజన్లు మండిపడుతున్నారు.

Delhi Police : హెల్మెట్ లేకుండా స్కూటీ నడిపిన పెళ్లికూతురు.. స్పందించిన ఢిల్లీ పోలీసులు

@Praveen_mishra9 అనే ట్విట్టర్ ఖాతానుంచి షేర్ చేసిన ఈ వీడియోని కారులో కూర్చున్న ఓ వ్యక్తి రికార్డు చేసినట్లు తెలుస్తోంది. వీడియోలో యువతి బైక్ ట్యాంక్ పై యువకుడికి ఎదురుగా కూర్చుని ఉంది. అతను హైవేపై బైక్ నడుపుతున్నాడు. ఈ వీడియోను షేర్ చేసిన వ్యక్తి పోలీస్ డిపార్ట్‌మెంట్‌కి కూడా ట్యాగ్ చేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ జంటను తిట్టిపోస్తున్నారు. ఇక పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో మరి.

 

ట్రెండింగ్ వార్తలు