Crime News: భార్యతో గొడవ పడి.. 3వ అంతస్తు నుంచి రెండేళ్ల కొడుకుని తోసేసి, తానూ దూకేసిన తండ్రి

ఢిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యతో గొడవపడ్డ ఓ వ్యక్తి తన రెండేళ్ల కుమారుడిని తమ అపార్టుమెంటులోని మూడో అంతస్తు నుంచి కిందికి తోసేసి, తానూ దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. దీనిపై స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనాస్థలికి వెళ్లిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు ఘటనాస్థలికి వెళ్లేసరికి తండ్రీకుమారుడు తీవ్రగాయాలతో కనపడ్డారు.

Man kills friend over Rs 10 in West Bengal's Siliguri

Crime News: ఢిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యతో గొడవపడ్డ ఓ వ్యక్తి తన రెండేళ్ల కుమారుడిని తమ అపార్టుమెంటులోని మూడో అంతస్తు నుంచి కిందికి తోసేసి, తానూ దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. దీనిపై స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనాస్థలికి వెళ్లిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు ఘటనాస్థలికి వెళ్లేసరికి తండ్రీకుమారుడు తీవ్రగాయాలతో కనపడ్డారు.

వారిద్దరినీ ఢిల్లీ ఎయిమ్స్ కు తరలించిన పోలీసులు చికిత్స అందేలా చేశారు. తండ్రీకొడుకుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గత రాత్రి న్యూ ఢిల్లీలోని కల్కాజీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు మీడియాకు తెలిపారు. మాన్సింగ్ అనే వ్యక్తి తన భార్య పూజతో ఉన్న గొడవల కారణంగా కొన్ని నెలలుగా ఆమెకు దూరంగా, వేరుగా నివసిస్తున్నాడని చెప్పారు. ఆ దంపతులకు ఇద్దరు పిల్లలని తెలిపారు.

పూజా తన తల్లి ఇంట్లో తన ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటోందని అన్నారు. గత రాత్రి తన భార్య పూజ వద్దకు వెళ్లిన మాన్సింగ్ ఆమెతో అక్కడే గొడవ పెట్టుకున్నాడని పోలీసులు చెప్పారు. ఆ క్రమంలో ఆవేశానికి గురైన మాన్సింగ్ తన రెండేళ్ల కుమారుడిని తీసుకుని బాల్కనీలోకి వెళ్లి కిందకు తోసేశాడని చెప్పారు. అనంతరం అతడు కూడా దూకేశాడని అన్నారు. మాన్సింగ్ పై హత్యాయత్నం కేసును నమోదుచేశామని తెలిపారు.

House fire In Manchiryala : పక్కా ప్లాన్‌తోనే ఇంటికి నిప్పంటించారు.. మంచిర్యాలలో ఇంటిలో ఆరుగురు సజీవ దహనం వెనుక షాకింగ్ విషయాలు