Cyclone Arnab Impact : అర్నబ్ తుపాను ఎఫెక్ట్.. ప్రయాణికులకు షాక్.. వరుసగా రెండు రోజులు రైళ్లు రద్దు!
Cyclone Arnab Impact : అర్నబ్ తుపాను ప్రభావంతో దక్షిణ కోస్తా రైల్వే పరిధిలో అక్టోబర్ 27, 28 తేదీల్లో 53 రైలు సర్వీసులు రద్దయ్యాయి. విజయవాడ, విశాఖపట్నం సహా పలు మార్గాల్లో ప్రయాణించే వారు రైళ్ల లేటెస్ట్ వివరాలను తెలుసుకోండి..
- Sreehari A
- Published on- October 26, 2026 / 09:13 PM IST
Cyclone Arnab Impact
- తుపాను దెబ్బకు రైళ్ల బ్రేక్.. దక్షిణ కోస్తా రైల్వే కీలక ప్రకటన
- రైలు ప్రయాణికులకు అలర్ట్.. అక్టోబర్ 27, 28 తేదీల్లో భారీగా సర్వీసుల రద్దు
- అర్నబ్ తుపాను బీభత్సం.. విజయవాడ నుంచి విశాఖ వరకు రైళ్లపై ప్రభావం
Cyclone Arnab Impact : తుపాను ప్రభావం రైలు ప్రయాణాలపైనా పడుతోంది. అర్నబ్ తుపాను నేపథ్యంలో దక్షిణ కోస్తా రైల్వే పరిధిలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడనుంది. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని రైళ్ల నిర్వహణలో మార్పులు చేపట్టినట్లు రైల్వే శాఖ పేర్కొంది.. అక్టోబర్ 27, 28 తేదీల్లో మొత్తం 53 రైలు సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు..
రెండు రోజులు.. భారీగా రైళ్ల రద్దు :
రైల్వే బులెటిన్ ప్రకారం.. అక్టోబర్ 27న 28 సర్వీసులు, అక్టోబర్ 28న 39 సర్వీసులు రద్దు కానున్నాయి. ఇందులో 14 రైలు నంబర్లకు సంబంధించిన సర్వీసులు రెండు రోజులూ అందుబాటులో ఉండవు. దీంతో ఆయా మార్గాల్లో ప్రయాణించాలనుకునే వారు ముందుగానే తమ ప్రయాణ ప్రణాళికలను సరిచూసుకోవాల్సిన అవసరం ఉంది..
విజయవాడ, మచిలీపట్నం, గుడివాడ, రాజమండ్రి, నర్సాపురం, విశాఖపట్నం తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఈ మార్పులను గమనించాలి. ముఖ్యంగా ఉద్యోగులు, విద్యార్థులు, వైద్య అవసరాల కోసం ప్రయాణించే వారు రైలు సమయాలకు సంబంధించి పూర్తి వివరాలను ముందుగానే తెలుసుకోవడం మంచిది..
కొన్ని రైళ్లకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు :
రద్దయిన సర్వీసుల నేపథ్యంలో కొన్ని రైళ్ల అనుసంధాన నిర్వహణకు కూడా ఏర్పాట్లు చేశారు. 67285, 67286 మెమూ రైళ్లు రద్దు కావడంతో 67290 పీఎస్‌ఏ–విశాఖపట్నం మెమూ, 67287 విశాఖపట్నం–విజయనగరం రైలును అనుసంధాన సర్వీసుగా నడపనున్నారు.
ప్రయాణానికి ముందు ఓసారి చెక్ చేయండి :
తుపాను సమయంలో ప్రయాణాల్లో అనిశ్చితి ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రయాణికులు రైల్వే అధికారిక సమాచారం, స్టేషన్ ప్రకటనలను పరిశీలించాలి. టికెట్ బుక్ చేసుకున్నవారు తమ రైలు నంబర్, ప్రయాణ తేదీ, సర్వీసు స్థితిని ముందుగానే చెక్ చేసుకోవాలి.. చివరి నిమిషంలో స్టేషన్‌కు చేరుకుని ఇబ్బందులు పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం బెటర్..
