Flipkart Diwali Sale 2026 : దీపావళికి ఫ్లిప్‌కార్ట్ ధమాకా.. స్మార్ట్ఫోన్ల నుంచి స్మార్ట్‌టీవీల వరకు.. అక్టోబర్ 28 నుంచి బిగ్ బ్యాంగ్ సేల్!
Flipkart Big Bang Diwali Sale 2026 : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్ 2026 అక్టోబర్ 28న ప్రారంభం కానుంది. స్మార్ట్ఫోన్లు, ఐఫోన్ 17, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ టీవీలు, గృహోపకరణాలపై డిస్కౌంట్లు, ఎస్బీఐ కార్డులతో 10శాతం ఇన్ స్టంట్ డిస్కౌంట్, ప్రత్యేక డీల్ టైమింగ్ వివరాలివే..
Flipkart Big Bang Diwali Sale 2026
- ఫ్లిప్‌కార్ట్‌లో పండగ ఆఫర్ల జాతర
- ఐఫోన్, శాంసంగ్ ఫోన్లపై భారీ డీల్స్..
- దీపావళి షాపింగ్‌కు ఇదే బెస్ట్ టైమ్..
Flipkart Big Bang Diwali Sale 2026 : దీపావళి వచ్చిందంటే కొత్త వస్తువులు కొనాలనే తెగ ఆసక్తి చూపిస్తుంటారు.. స్మార్ట్‌ఫోన్ మార్చుకోవాలన్నా, ఇంటికి కొత్త టీవీ తీసుకోవాలన్నా, హోం అప్లియన్సెస్ కొనాలన్నా పండగ సేల్ కోసం ఎప్పుడు వస్తుందా ఎదురుచూస్తుంటారు..
అలాంటి షాపింగ్ ప్రియుల కోసం ఫ్లిప్‌కార్ట్ బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్ 2026ను తీసుకొస్తోంది. ఈ సేల్ అక్టోబర్ 28న ప్రారంభం కానుంది. ఎలక్ట్రానిక్స్ నుంచి రోజువారీ అవసరాలకు ఉపయోగపడే వస్తువుల వరకు పలు విభాగాల్లో ఆకర్షణీయమైన డీల్స్ అందుబాటులో ఉండనున్నాయి. అవేంటో ఓసారి వివరంగా తెలుసుకుందాం..
స్మార్ట్ఫోన్లపై ప్రత్యేక ఆఫర్లు :
ఈ సేల్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎస్25 ఎఫ్ఈ, గెలాక్సీ ఎస్25, ఒప్పో కె14ఎక్స్, వివో టీ5 లైట్, నథింగ్ ఫోన్ (4బి), పోకో వంటి స్మార్ట్ఫోన్లపై భారీ తగ్గింపులు లభించనున్నాయి. ఐఫోన్ 17కు సంబంధించిన డీల్స్‌పైనా కొనుగోలుదారులు ఫోకస్ పెట్టొచ్చు.. అయితే, ప్రతి ఫోన్ అసలు ధర, తగ్గింపు, బ్యాంక్ ఆఫర్ వివరాలను కొనే ముందు చెక్ చేయడం బెటర్..
SBI కార్డులతో అదనపు బెనిఫిట్స్ :
ఫ్లిప్‌కార్ట్ ప్రకటించిన బ్యాంక్ ఆఫర్లలో భాగంగా ఎస్బీఐ డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, క్రెడిట్ కార్డు ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం ఇన్ స్టంట్ డిస్కౌంట్ అందుబాటులో ఉండనుంది. అర్హత నిబంధనలు, గరిష్ఠ తగ్గింపు పరిమితులు వర్తించవచ్చు.
Read Also : Dhanush Political Entry : ధనుష్ పొలిటికల్ ఎంట్రీపై ఉత్కంఠ.. వెండి దీపాలపై కమలం గుర్తుతో కొత్త రచ్చ!
టీవీలు, ల్యాప్‌టాప్‌లు, వాషింగ్ మెషీన్లపై డీల్స్ :
శాంసంగ్ బుక్ 5, హెచ్‌పీ 15 కోర్ 5 ల్యాప్‌టాప్‌లు, ఎల్జీ 43 అంగుళాల 4K స్మార్ట్ టీవీ, ఫుల్ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్లు, మోటో ప్యాడ్ 60 నియో వంటి ప్రొడక్టులపై ప్రత్యేక ధరలు ప్రకటించారు. డాష్‌క్యామ్‌లు, ఇతర డివైజ్‌లపై 50 శాతం నుంచి 70 శాతం వరకు, టైటాన్ వాచీలపై 30 శాతం నుంచి 50 శాతం వరకు తగ్గింపులు అందుబాటులో ఉండనున్నాయి.
సాయంత్రం డీల్స్ మిస్ కావొద్దు :
బిగ్ బ్యాంగ్ అవర్స్ సాయంత్రం 7 నుంచి 9 గంటల వరకు, ఫైర్‌క్రాకర్ డీల్స్ రాత్రి 8 నుంచి 10 గంటల వరకు ఉంటాయి. పండుగ బెస్ట్ సెల్లర్స్ సాయంత్రం 5 నుంచి 7 గంటల మధ్య, ప్రైస్ క్రాషెస్ రాత్రి 7 నుంచి 8 గంటల మధ్య అందుబాటులో ఉంటాయి.
మొత్తంగా, దీపావళి కొనుగోళ్లను ప్లాన్ చేసుకునేవారికి ఈ సేల్ అద్భుతమైన అవకాశం.. మీకు కావాల్సిన వస్తువు ధరను ముందుగానే పోల్చి చూసి నిజంగా ప్రయోజనం పొందే డీల్‌ను ఎంచుకుంటే పండగ షాపింగ్ మరింత అద్భుతంగా ఉంటుంది.
ఫ్లిప్‌కార్ట్ ఒరిజినల్స్‌పై డీల్స్ :
- రియల్‌మి టెక్ లైఫ్ టీవీలు రూ. 9,999 నుంచి ప్రారంభం.
- వాషింగ్ మెషీన్లు రూ. 6,490 నుంచి ప్రారంభం.
- మోటోరోలా టీవీలు రూ. 11,999 నుంచి ప్రారంభం.
- రిఫ్రిజిరేటర్లు రూ.6,990 నుంచి ప్రారంభం.
- 32-అంగుళాల బిలియన్ టీవీలు రూ. 4,737 నుంచి ప్రారంభం.
- సౌండ్బార్లు రూ. 2,199 నుంచి ప్రారంభం.
- స్మార్ట్ ఏసీలు రూ. 22,990 నుంచి ప్రారంభం.
- స్మార్ట్ అప్లయెన్సెస్ రూ. 4,999 నుంచి ప్రారంభం
