Samsung Galaxy S25 FE 5G : దీపావళి ధమాకా సేల్.. ఈ శాంసంగ్ 5G ఫోన్ అతి చౌకైన ధరకే.. ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్ ఎంతంటే?
Samsung Galaxy S25 FE : ఈ శాంసంగ్ ఫోన్లో 50MP ప్రైమరీ కెమెరా, 12MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. శాంసంగ్ గెలాక్సీ S25 ఎఫ్ 5జీ భారీ తగ్గింపుతో ఇలా కొనేసుకోండి..
Samsung Galaxy S25 FE
- ఫ్లిప్‌కార్ట్ భారీ షాపింగ్ ఉత్సవ్ సేల్
- శాంసంగ్ గెలాక్సీ S25 ఎఫ్ఈ 5జీ భారీ తగ్గింపు
- లాంచ్ ధర కన్నా సుమారుగా రూ.17,250 తక్కువకే
Samsung Galaxy S25 FE : దీపావళికి ముందు ఫ్లిప్‌కార్ట్ భారీ షాపింగ్ ఉత్సవ్ సేల్ నిర్వహిస్తోంది. మీరు కొత్త ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తుంటే ఇదే బెస్ట్ టైమ్.. శాంసంగ్ అప్పర్-మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్ శాంసంగ్ గెలాక్సీ S25 ఎఫ్ఈ 5జీ ఫోన్ అతి చౌకైన ధరకే లభిస్తోంది. ఈ ఫోన్లో 50MP ప్రైమరీ కెమెరా, 12MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. శాంసంగ్ గెలాక్సీ S25 ఎఫ్ 5జీపై డీల్స్ (Samsung Galaxy S25 FE 5G) ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
శాంసంగ్ గెలాక్సీ S25 ఎఫ్ఈ 5జీ ధర, ఆఫర్లు :
గతేడాది సెప్టెంబర్‌లో రూ. 59,999 ధరకు లాంచ్ అయిన శాంసంగ్ గెలాక్సీ S25 ఎఫ్ఈ 5జీ (8GB+128GB) స్టోరేజ్ వేరియంట్, ఇప్పుడు రూ. 44,999 ధరకు లభిస్తోంది. ఈ పండుగ సేల్ సమయంలో, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేస్తే రూ. 2,250 ఆదా చేసుకోవచ్చు. దాంతో ధర రూ. 42,749 అవుతుంది. సెప్టెంబర్ లాంచ్ ధర కన్నా సుమారుగా రూ.17,250 తక్కువకే లభిస్తోంది.
గెలాక్సీ S25 FE 5జీ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
శాంసంగ్ గెలాక్సీ S25 ఎఫ్ఈ 5జీ ఫోన్ 6.7-అంగుళాల డైనమిక్ అమోల్డ్ 2ఎక్స్ డిస్ప్లేతో వస్తుంది. రిజల్యూషన్ 1080×2340 పిక్సెల్స్, రిఫ్రెష్ రేట్ 120Hz, గరిష్టంగా 1900 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అందిస్తుంది.
కంపెనీ సొంత ఎక్సినోస్ 2400 చిప్సెట్తో రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ పొడవు 161.3 మి.మీ., వెడల్పు 76.6 మి.మీ, మందం 7.4 మి.మీ, బరువు 190 గ్రాములు ఉంటుంది. ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP68 రేటింగ్ అందిస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ S25 ఎఫ్ఈ బ్యాక్ సైడ్ 50MP ప్రైమరీ కెమెరా, 8MP టెలిఫోటో కెమెరా, 12MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12MP ఫ్రంట్ కెమెరా అందుబాటులో ఉంది.
కనెక్టివిటీ ఆప్షన్లలో 4జీ, 5జీ, Wi-Fi, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఈ శాంసంగ్ ఫోన్ 4,900mAh బ్యాటరీతో రన్ అవుతుంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.
