ఎంపీకి టికెట్ వచ్చిందని తెలియగానే.. ఎమ్మెల్యే డాన్స్ చేశాడు.. వీడియో వైరల్

టికెట్ వచ్చిన విషయం తెలియగానే బీజేపీ ఎమ్మెల్యే నీరజ్ జింబా ఆనందంతో డాన్స్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజనులు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

Darjeeling BJP MLA Neeraj Zimba: దేశవ్యాప్తంగా ఇప్పుడు ఎన్నికల హడావుడి నడుస్తోంది. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల కసరత్తులో మునిగి తేలుతున్నాయి. వ్యూహ, ప్రతివ్యూహాలపై ముమ్మరంగా కసరత్తు చేస్తున్నాయి. అభ్యర్థుల ఎంపిక అన్ని పార్టీలకు సవాలుగా మారింది. ఇక టికెట్ల కోసం ఆశావహులు తమ వంతు పయత్నాలు చేసుకుంటున్నారు. అధినాయకత్వం దృష్టిలో పడి టికెట్ సాధించేందుకు రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. టికెట్ రాదనుకుంటే బెదిరింపులకు దిగుతున్నారు. టికెట్ వచ్చిన వారు మాత్రం సంబరాల్లో మునిగిపోతున్నారు.

పశ్చిమ బెంగాల్‌లో 19 స్థానాలకు అభ్యర్థులను బీజేపీ ఆదివారం ప్రకటించింది. డార్జిలింగ్ స్థానానికి సిట్టింగ్ ఎంపీ రాజు బిస్తా పోటీ చేస్తారని తెలిపింది. ఈ విషయం తెలియగానే డార్జిలింగ్ బీజేపీ ఎమ్మెల్యే నీరజ్ జింబా సంతోషంతో డాన్స్ చేశారు. తనదైన శైలిలో డాన్స్ చేసి అలరించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎమ్మెల్యే నీరజ్ డాన్స్ వీడియో చూసిన నెటిజనులు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

కాగా, డార్జిలింగ్ ఎంపీ సీటు రాజు బిస్తాకు ఇవ్వకపోతే తాను ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగుతానని బీజేపీ అధినాయకత్వానికి ఎమ్మెల్యే నీరజ్ తెలిపారు. తన పంతం నెగ్గడంతో ఆనందంతో ఉత్సాహంగా డాన్స్ చేశారు. ఏప్రిల్ 26న డార్జిలింగ్‌లో పోలింగ్ జరగనుంది.

Also Read: ఢిల్లీ మెట్రో రైలులో విచిత్ర ఘటన.. ఇద్దరమ్మాయిలు హోలీ రంగులు పూసుకోవడమే కాకుండా..

2009 నుండి డార్జిలింగ్ స్థానాన్ని BJP నిలుపుకుంటూ వస్తోంది. జస్వంత్ సింగ్, SS అహ్లువాలియా, రాజు బిస్తాతో ఈ స్థానానికి ప్రాతినిథ్యం వహించారు. వీరంతా స్థానికేతరుల కావడం విశేషం. మణిపూర్‌ గూర్ఖా సామాజిక వర్గానికి చెందిన రాజు బిస్తాకు సిలిగురితో కుటుంబ సంబంధాలు ఉన్నాయి.

 

ట్రెండింగ్ వార్తలు