UIDAI Aadhaar : ఇంట్లో ఎవరైనా చనిపోయారా? అయితే ఆధార్ విషయంలో ఈ పని తప్పక చేయండి! లేదంటే సమస్యే..

Deactivate UIDAI Aadhaar : మరణించిన వ్యక్తుల ఆధార్‌ను డీయాక్టివేట్ చేయడం ద్వారా గుర్తింపు మోసాలు, అనధికార లావాదేవీలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల దుర్వినియోగాన్ని అడ్డుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.

Deactivate Aadhaar Of Deceased Person

Deactivate UIDAI Aadhaar: ఆధార్ కార్డు ప్రతి భారతీయుడి జీవితంలో అత్యంత కీలకమైన గుర్తింపు పత్రంగా మారిపోయింది. ప్రభుత్వ పథకాలు, బ్యాంకింగ్ సేవలు, ఆస్తి లావాదేవీలు ఇలా అనేక వ్యవహారాల్లో ఆధార్ తప్పనిసరిగా మారింది. అయితే, కుటుంబంలో ఎవరైనా మరణించిన తర్వాత కూడా వారి ఆధార్ నంబర్ యాక్టివ్‌గా ఉంటే దాని దుర్వినియోగానికి అవకాశం ఉండొచ్చు. అందుకే మరణించిన వ్యక్తి ఆధార్‌ను డీయాక్టివేట్ చేయడంపై UIDAI కీలక చర్యలు చేపడుతోంది.

Also Read : Karnataka : సీఎం సార్.. ఆరు గ్యారెంటీలు కాదు.. ఏడు గ్యారెంటీలు.. పెళ్లిని కూడా చేర్చాలన్న యువకుడు

మరణించిన వ్యక్తుల ఆధార్‌ను డీయాక్టివేట్ చేయడం ద్వారా గుర్తింపు మోసాలు, అనధికార లావాదేవీలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల దుర్వినియోగాన్ని అడ్డుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. అలాగే ప్రభుత్వ రికార్డుల్లో మరణించిన వ్యక్తుల వివరాలను సక్రమంగా గుర్తించి, అర్హులైన వారికి మాత్రమే ప్రభుత్వ ప్రయోజనాలు అందేలా చూడటానికి ఈ ప్రక్రియ ఉపయోగపడుతుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా కోట్లాది మంది మరణించిన వ్యక్తుల ఆధార్ నంబర్లను గుర్తించి డీయాక్టివేట్ చేసినట్లు కేంద్రం వెల్లడించింది.

కుటుంబ సభ్యులు స్వయంగాకూడా ఈ విషయాన్ని UIDAIకి తెలియజేయవచ్చు. ఇందుకోసం myAadhaar పోర్టల్‌లో ‘Report Death of a Family Member’ అనే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ముందుగా సంబంధిత అధికారుల నుంచి మరణ ధ్రువీకరణ పత్రం పొందాలి. అనంతరం myAadhaar పోర్టల్‌లో కుటుంబ సభ్యుడు తన గుర్తింపును ధ్రువీకరించుకుని, మరణించిన వ్యక్తి ఆధార్ నంబర్, Death Registration Number (DRN), మరణ ధ్రువీకరణ పత్రానికి సంబంధించిన వివరాలను నమోదు చేయాలి. వివరాలను UIDAI ధ్రువీకరించిన అనంతరం ఆధార్ డీయాక్టివేషన్‌కు సంబంధించిన చర్యలు తీసుకుంటుంది.

అయితే, ఈ ఆన్‌లైన్ సదుపాయం అన్ని ప్రాంతాల్లో ఒకేసారి అందుబాటులో ఉండకపోవచ్చు. అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో కుటుంబ సభ్యులు ఆలస్యం చేయకుండా మరణాన్ని రిపోర్ట్ చేయడం మంచిది. ఇలా చేయడం వల్ల మరణించిన వ్యక్తి ఆధార్ దుర్వినియోగం అయ్యే అవకాశాలను తగ్గించడంతో పాటు, ప్రభుత్వ రికార్డులు కూడా మరింత కచ్చితంగా ఉండేలా చేయవచ్చు.