Narendra Modi: ఆస్ట్రేలియా వస్తే చంపేస్తాం.. పర్యటనకు ముందే మోదీకి బెదింపులు.. ఇరు దేశాల రక్షణ వర్గాల హై అలర్ట్

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi) ఆస్ట్రేలియా పర్యటనకు సిద్ధమవుతున్న తరుణంలో ఆయనకు ఆన్‌లైన్‌ వేదికగా ప్రాణభీతి ముప్పు రావడం సంచలనం రేపింది.

Death threat against PM Narendra Modi ahead of Melbourne visit.

  • ప్రధాని మోదీకి హత్యా బెదిరింపులు
  • ఆస్ట్రేలియా పోలీసుల ప్రత్యేక నిఘా
  • షెడ్యూల్ ప్రకారమే ప్రధాని పర్యటన

Narendra Modi: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా పర్యటనకు సిద్ధమవుతున్న తరుణంలో ఆయనకు ఆన్‌లైన్‌ వేదికగా ప్రాణభీతి ముప్పు రావడం సంచలనం రేపింది. జులై 8 నుంచి 10 వరకు జరగనున్న ఆస్ట్రేలియా-భారత్ వార్షిక నాయకత్వ సదస్సు కోసం ప్రధాని మోదీ అక్కడికి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా మెల్‌బోర్న్‌ నగరంలో ప్రవాస భారతీయులతో నిర్వహించతలపెట్టిన భారీ బహిరంగ సభను టార్గెట్ చేస్తూ గుర్తుతెలియని వ్యక్తులు ఈ హెచ్చరికలు జారీ చేశారు.

TTD: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. రెండు రోజులపాటు వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు

ఈ వివాదం జులై 9న మెల్‌బోర్న్‌లోని మార్వెల్ స్టేడియంలో జరగబోయే ‘మెల్‌బోర్న్ మీట్స్ మోదీ(Narendra Modi)’ కార్యక్రమానికి సంబంధించిన ప్రచార పోస్ట్ ద్వారా వెలుగుచూసింది. ఫేస్‌బుక్‌లోని సదరు పోస్ట్‌ కింద ‘అబు ముస్తఫా’ అనే ఐడీ నుంచి ఒక అపరిచిత వ్యక్తి తీవ్రమైన కామెంట్‌ పెట్టాడు. సభ సమయంలో స్టేడియం పైకప్పులు మూసి ఉంచకపోతే ప్రధాని మోదీ తన చావు కోసమే ఆస్ట్రేలియా వస్తున్నట్లు అవుతుందని ఆ కామెంట్‌లో రాసుకొచ్చాడు. ఈ విషయాన్ని గమనించిన భద్రతా విభాగాలు వెంటనే రంగంలోకి దిగాయి.

ఆస్ట్రేలియా ఫెడరల్ పోలీసులు (ఏఎఫ్‌పీ) ఈ ఆన్‌లైన్ బెదిరింపుపై కేసు నమోదు చేసి అత్యంత వేగంగా దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక నిపుణుల సాయంతో సదరు ఫేస్‌బుక్ ఖాతాకు సంబంధించిన ఐపీ అడ్రస్‌ను సైతం అధికారులు ఇప్పటికే ట్రేస్ చేశారు. ఈ బెదిరింపుల నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రధాని భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది. అయితే ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే ప్రధాని మోదీ పర్యటన కొనసాగుతుందని, ఎలాంటి మార్పులు ఉండబోవని ఇరు దేశాల రక్షణ వర్గాలు స్పష్టం చేశాయి.