Besharam Rang: వివాదాస్పదంగా మారిన పఠాన్ సినిమాలోని ‘బేషరం రంగ్’ పాట.. సినిమా విడుదల డౌటే అన్న ఎంపీ మంత్రి
పఠాన్ సినిమాలో నటి దీపిక పదుకొనె తుక్డే తుక్డే గ్యాంగ్‌కు మద్దతు ఇస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఆమె దుస్తులు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి. అలాగే పాటను డర్టీ మైండ్‌సెట్‌తో తెరకెక్కించారు. పాటలోని సీన్లు, కాస్ట్యూమ్స్ సరి చేయాలి. అలా చేయకపోతే మధ్యప్రదేశ్‌లో సినిమాను అనుమతించాలా వద్దా అని ఆలోచించాల్సి ఉంటుంది
- tony bekkal
- Published On : December 14, 2022 / 05:33 PM IST
Deepika Padukone's costumes in 'Besharam Rang' sparks row
Besharam Rang: బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న ‘పఠాన్’ సినిమాలోని ‘బేషరం రంగ్’ అనే పాట తాజాగా విడుదలై సినిమా ప్రియులను అమితంగా ఆకట్టుకుంటోంది. అయితే ఒకవైపు షారూఖ్, దీపిక అభిమానుల మనసుల్ని దోచుకుంటున్న ఈ పాట.. మరొకవైపు వివాదాస్పదంగా మారింది. కారణం.. పాటలోని లిరిక్స్ సహా.. దీపిక, షారూఖ్ వేసుకున్న బట్టలు. ఈ విషయమై మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రి నరోత్తమ్ మిశ్రా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాటలోని సీన్లు, కాస్ట్యూమ్స్ మార్చకపోతే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సినిమాను విడుదల కానివ్వబోమంటూ ఆయన హెచ్చరించారు.
ఈ విషయమై బుధవారం ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ ‘‘పఠాన్ సినిమాలో నటి దీపిక పదుకొనె తుక్డే తుక్డే గ్యాంగ్‌కు మద్దతు ఇస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఆమె దుస్తులు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి. అలాగే పాటను డర్టీ మైండ్‌సెట్‌తో తెరకెక్కించారు. పాటలోని సీన్లు, కాస్ట్యూమ్స్ సరి చేయాలి. అలా చేయకపోతే మధ్యప్రదేశ్‌లో సినిమాను అనుమతించాలా వద్దా అని ఆలోచించాల్సి ఉంటుంది’’ అని ట్వీట్ చేశారు. ఇక ఈ పాటలో దీపిక కాషాయం రంగు బట్టలు వేసుకోవడం, షారూఖ్ ముదురు రంగు బట్టలు వేసుకోవడాన్ని సైతం ఆయన ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించారు. ఆ రంగుల్ని సైతం మార్చాలని మంత్రి నరోత్తమ్ మిశ్రా డిమాండ్ చేశారు.
