Apple iOS 16.2 Update : ఐఫోన్ 12 సహా ఆపై మోడళ్లలో 5G సపోర్టుతో iOS 16.2 అప్‌డేట్.. మీ ఐఫోన్ ఉందేమో చెక్ చేసుకోండి!

Apple iOS 16.2 Update : ఆపిల్ ఐఫోన్ యూజర్లకు అలర్ట్.. ఐఫోన్‌లలో 5G కనెక్టవిటీని పొందలేకపోతున్నారా? అయితే వెంటనే మీ స్మార్ట్‌ఫోన్‌లలో 5G కనెక్టివిటీని అన్‌లాక్ చేయవచ్చు. Apple ఐఫోన్‌లలో iOS 16.2ను రిలీజ్ అయింది.

Apple iOS 16.2 Update : ఐఫోన్ 12 సహా ఆపై మోడళ్లలో 5G సపోర్టుతో iOS 16.2 అప్‌డేట్.. మీ ఐఫోన్ ఉందేమో చెక్ చేసుకోండి!

Apple rolling out iOS 16.2 update for iPhone 12 and above models in India, brings 5G support

Apple iOS 16.2 Update : ఆపిల్ ఐఫోన్ యూజర్లకు అలర్ట్.. ఐఫోన్‌లలో 5G కనెక్టవిటీని పొందలేకపోతున్నారా? అయితే వెంటనే మీ స్మార్ట్‌ఫోన్‌లలో 5G కనెక్టివిటీని అన్‌లాక్ చేయవచ్చు. Apple ఐఫోన్‌లలో iOS 16.2ను రిలీజ్ అయింది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లోని iPhone యూజర్లు Airtel, Reliance Jio సర్వీసులను ఉపయోగిస్తుంటే 5G కనెక్టివిటీని పొందవచ్చు. Settings > General > Software updateకు వెళ్లడం ద్వారా వినియోగదారులు Update చెక్ చేయవచ్చు.

iOS 16.2కి అప్‌డేట్ చేయడానికి మీ డివైజ్‌లో తగినంత బ్యాటరీ ఉందని నిర్ధారించుకోవడం ముఖ్యం. iOS 16.2కి అప్‌డేట్ చేసిన తర్వాత, అర్హత ఉన్న iPhone మోడల్‌లలో iPhone 14, iPhone 13, iPhone SE 3, iPhone 12 లైనప్‌లలో మాన్యువల్‌గా 5Gని యాక్టివేట్ చేసుకోవాలి. మీ iPhoneలో 5Gని అందించేందుకు Settings > Mobile Data > Mobile Data options > Voice and Data > 5G or 5G Autoకు వెళ్లండి. 5Gని ఉపయోగించడం ద్వారా బ్యాటరీ లైఫ్ తగ్గిపోవచ్చని ఆపిల్ హెచ్చరించింది. ఆపిల్ యూజర్లు బ్యాటరీని సేవ్ చేయడానికి 5G Auto Option ఎంచుకోవచ్చు.

Apple rolling out iOS 16.2 update for iPhone 12 and above models in India, brings 5G support

Apple rolling out iOS 16.2 update for iPhone 12 and above models in India, brings 5G support

Airtel వినియోగదారుల కోసం ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, సిలిగురి, నాగ్‌పూర్, వారణాసి, పానిపట్, గురుగ్రామ్, గౌహతి, పాట్నాలలో Airtel 5G లేదా 5G Plus అందుబాటులో ఉంది. Reliance Jio 5G సర్వీసుల్లో ఢిల్లీ-NCR, ముంబై, కోల్‌కతా, వారణాసి, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, పూణే, నాథద్వారా మరియు గుజరాత్ (33 జిల్లాలు)లో అందుబాటులో ఉంది. Vi (Vodafone Idea) భారత మార్కెట్లో 5G సర్వీసులను ఇంకా రిలీజ్ చేయలేదు. టెల్కోలు ఇంకా 5G టారిఫ్‌లను ప్రకటించలేదు. Airtel, Jio కస్టమర్‌లు 5Gని ఉచితంగా టెస్టింగ్ చేసుకోవచ్చు.

కంపెనీల ఉచిత 5G సర్వీసుల గురించి మరింత తెలుసుకునేందుకు యూజర్లు Airtel, Jio యాప్‌లను ఉపయోగించవచ్చు. మీరు అర్హత గల సర్కిల్‌లలో Airtel, Jio 5G సర్వీసులను ఎలా యాక్టివేట్ చేయాలనే కవరేజీని కూడా చూడవచ్చు.లేటెస్ట్ iOS 16.2 అప్‌డేట్‌లో AirDropని లిమిట్ చేసే కొత్త సెక్యూరిటీ ఫీచర్‌ ఉంది. అప్‌డేట్‌ ద్వారా ఐఫోన్‌లు ఎయిర్‌డ్రాప్ సెట్టింగ్‌లను ‘Everyone’ సెట్ చేసిన 10 నిమిషాల తర్వాత ఆటోమేటిక్‌గా ‘Contacts Only’కి మారిపోతుంది. ఆపిల్ ఐఫోన్లలో ఎయిర్‌డ్రాప్ అనే సెట్టింగ్ iOS 16.1.1తో చైనాలో అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూజర్లకు అందుబాటులోకి రానుంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Apple iOS 16.0.2 Update : ఆపిల్ iOS కొత్త అప్‌డేట్.. కొత్త ఐఫోన్లలో బగ్ ఫిక్స్.. మీ ఫోన్ చెక్ చేసుకున్నారా?