ఢిల్లీలో ఆమాద్మీ పార్టీ విజయాన్ని సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు రెండు పండుగలు ఒకేసారి వచ్చాయి. ఓ పక్క ఆప్ పార్టీ విజయం..మరోపక్క తన భార్య సునీత పుట్టిన రోజు. ఈ సందర్భంగా పార్టీ ఘన విజయం దిశగా దూసుకుపోతుండటంతో భార్య సునీత బర్త్ డే కేక్ కట్ చేయించి ఘనంగా సంబరాలు జరుపుకున్నారు.
ఇవాళే అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీత పుట్టినరోజు. ఈ లెక్కన ఎన్నికల్లో గెలుపుతో భార్యకు కేజ్రీవాల్ అదిరిపోయే బర్త్ డే గిఫ్ట్ ఇచ్చినట్లయింది. ఢిల్లీలోని ఆమాద్మీ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ విజయోత్సవ వేడుకలతో పాటు సునీత బర్త్ డే వేడుకలు ఒకేసారి జరిగాయి. కేక్ కట్ చేసి.. భార్యకు తినిపించారు కేజ్రీవాల్.
Today is also Arvind Kejriwal’s wife Sunita’s birthday. https://t.co/ZmsCA2KuiS
— ANI (@ANI) February 11, 2020
ఢిల్లీలో ఆప్ పార్టీ గెలుపు దిశగా దూసుకుపోతోంది. ఆప్ పార్టీ విజయాన్ని ఇక ఎవ్వరూ అడ్డుకోలేరు. ఎందుకుంటే మొత్తం 70 స్థానాలు ఉన్న ఢిల్లీలో ఆప్ ఇప్పటికే 62 స్థానాల్లో ఆధిక్యతతో దూసుకుపోతోంది. కేవలం 8 స్థానాల్లో మాత్రమే బీజేపీ ఆధిక్యంలో ఉంది. దీంతో హావాతో పార్టీ కార్యకర్తలు సంతోషంగా ఉబ్బి తబ్బిబ్బు అవుతున్నారు. హ్యాట్రిక్ కొట్టిన ఆప్ పార్టీ ఢిల్లీ పీఠాన్ని మరోసారి కైవసం చేసుకోవటం తథ్యం అనే విషయం తెలిసిందే.
దీంతో కాంగ్రెస్, బీజేపీ వంటి జాతీయ పార్టీలను చీపురుతో ఊడ్చేసి పడేసినట్లైంది. ముచ్చటగా మూడోసారి హస్తినలో అధికారాన్ని చేజిక్కించుకుంది. ఈ సంచలన విజయాన్ని ఆమాద్మీ శ్రేణులు ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాయి. ఆమాద్మీ కార్యాలయంతో పాటు కేజ్రీవాల్ నివాసంలో సంబరాలు మిన్నంటాయి.