BJP Autos Gifted To CM Kejriwal : సీఎం కేజ్రీవాల్‌కు ఆటోలు గిఫ్టుగా ఇచ్చిన బీజేపీ నేతలు

ఢిల్లీ సీఎం అరవింత కేజ్రీవాల్ కు బీజేపీ నేతలు ఆటోలు బహుమతిగా ఇచ్చారు. కేజ్రీవాల్ అద్భుతమైన నటుడు అంటూ పొగిడారు బీజేపీ నేతలు.

BJP leaders gifted autos to CM Kejriwal : ఢిల్లీ సీఎం అరవింత కేజ్రీవాల్ కు బీజేపీ నేతలు ఆటోలు బహుమతిగా ఇచ్చారు. సీఎంకు ఆటోలు బహుమతిగా ఇవ్వటమేంటీ..పైగా బీజేపీ నేతలు ఇవ్వటమేంటీ?అనే డౌట్ వచ్చి తీరుతుంది. ఇటీవల గుజరాత్‌లో ఆటోలో ప్రయాణించారు న ఆప్‌ కన్వీనర్..ఢీల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌. పంజాబ్ ఎన్నికల సమయంలో కూడా తనదైనశైలిలో ఆటోలో ప్రయాణంచటం ఆటో డ్రైవర్ ఇంటికెళ్లి భోజనం చేయటం వంటివి చేశారు కేజ్రీవాల్. అలా తనదైనశైలిలో ప్రజలను ఆకట్టుకుని పంజాబ్ లో అధికారంలోకి వచ్చింది ఆప్.

ఈ క్రమంలో గుజరాత్ లో కూడా అధికారంలోకి రావటానికి యత్నాలు మొదలుపెట్టింది.గుజరాత్ లో పర్యటిస్తూ ఓ ఆటోలో ప్రయాణించారు కేజ్రీవాల్. దీంతో కేజ్రీవాల్ ఆటోలో ప్రయాణం చేసి డ్రామాలాడుతున్నారంటూ బీజేపీ నేతలు ఎద్దేవా చేస్తూ కేజ్రీవాల్ కు ఐదు ఆటోలు గిఫ్టుగా ఇచ్చారు. కేజ్రీవాల్‌ కాన్వాయ్‌లో 27 వాహనాలుంటాయి. ఆయన భద్రత కోసం 200 మంది భద్రతా సిబ్బంది ఉన్నారు. కానీ ఆయన మాత్రం గుజరాత్‌లో ఆటోలో ప్రయాణించారు. ఢిల్లీలో ఆటోలో వెళ్లాలన్న ఆయన కోరికను నెరవేర్చేందుకు ఈ ఐదు ఆటోలను బహుమతి అందిస్తున్నాం అని తెలిపారు బీజేపీ నేతలు.ఐదు ఆటోలు ఎందుకంటే.. ఒక ఆటో.. పైలట్‌గా పనిచేస్తుంది. ఇంకొకటి ఆయన కోసం, మరో రెండు భద్రతా సిబ్బందికి, ఐదోది ఆయన ప్రైవేటు సెక్రటరీ కోసం’ అంటూ బీజేపీ నేతలు వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

Gujarat Elections: హైడ్రామా నడుమ ఆటో డ్రైవర్ ఇంట్లో భోజనం చేసిన కేజ్రీవాల్

కాగా..ఢిల్లీలో ప్రారంభమైన ఆప్ ప్రస్థానం జాతీయ పార్టీగా అవతరించింది. పంజాబ్ లో కూడా అధికారంలోకి వచ్చింది. దీంతో ఆప్ మాంచి దూకుడుమీదుంది. కొద్ది నెలల్లో గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో అక్కడ కూడా తనమార్కు చూపించాలనుకుంటోంది ఆప్. గుజరాత్ లో ఎన్నికల్లో కూడా గెలిచి అధికారంలోకి రావటానికి సీఎం అరవింత్ కేజ్రీవాల్ ఇప్పటికే యత్నాలు ప్రారంభించేశారు. దీంట్లో భాగంగానే తరచు గుజరాత్ లో పర్యటిస్తున్నారు. పలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో ఇటీవల గుజరాత్ వెళ్లిన కేజ్రీవాల్ ఆటోలో ప్రయాణించగా బీజేపీ నేతలు ఓట్ల కోసం ఇదొక డ్రామా అంటూ ఆయనకు ఆటోలో ప్రయాణించటం అంటే ఇష్టమల్లే ఉంది అందుకే ఆటోలు గిఫ్టు ఇచ్చామని తెలిపారు.

కొద్ది నెలల్లో గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న క్రమంలో  ఆప్‌ దూకుడుగా ప్రచారం చేపడుతోంది. ఈ క్రమంలో ఇటీవల ఓ ఆటో డ్రైవర్‌ ఆహ్వానం మేరకు కేజ్రీవాల్‌ అతడి ఆటోలోనే భోజనం చేసేందుకు బయలుదేరారు. అయితే కొద్ది దూరం వెళ్లాక భద్రతాపరమైన కారణాలు చెబుతూ స్థానిక పోలీసులు ఆటోను అటకాయించారు. తనకు భద్రత అవసరం లేదని, తనను వెళ్లనివ్వాలని కోరడంతో కేజ్రీవాల్‌ ప్రయాణిస్తున్న ఆటోకు పోలీసులు అడ్డుతొలిగారు. దీంతో కేజ్రీవాల్‌ డ్రైవర్‌ ఇంటికి చేరుకుని భోజనం చేశారు. అయితే ఈ ఘటనపై రాష్ట్ర బీజేపీ విమర్శలు గుప్పించింది. కేజ్రీవాల్‌ గొప్ప నటుడంటూ ఎద్దేవా చేశారు.

Kejriwal’s Reaction: కేజ్రీవాల్‌ను డిన్నర్‌కు ఆహ్వానించిన ఆటో డ్రైవర్.. కేజ్రీవాల్ సమాధానం ఇదే

 

ట్రెండింగ్ వార్తలు