arvind kejriwal Rs.2000 Note
Rs 2000 denomination cm arvind kejriwal : 2016లో పెద్ద నోట్ల రద్దు ప్రకటన చేసిన ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజల్ని నడిరోడ్డుపై నిలబెట్టేశారు. అప్పుడు చలామణీలో ఉన్న రూ.1000 నోట్లతో అవినీతి పెరిగిపోయిందని..బ్లాక్ మనీకి కారణమవుతోందని చెప్పిన ప్రధాని దాని కంటే పెద్ద నోటును అంటే రూ.2000నోటును అందుబాటులోకి తీసుకొచ్చారు. తాజాగా రూ.2000 నోటును రద్దు చేస్తున్నామని ఆర్బీఐ ప్రకటించింది. దీంతో దేశంలో మరోసారి గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. తమ వద్ద ఉన్న రూ.2000 నోట్లను ఎలా వదిలించుకోవాలా అని జనాలు పరుగులు పెడుతున్నారు.
ఈ పరిస్థితితపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని మోదీపై కేజ్రీ విమర్శలు చేశారు. అందుకు విద్యావంతుడైన ప్రధాని కావాలని అనే అన్నది అంటూ మరోసారి ప్రధాని మోదీ విద్యార్హతన గురించి ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ విద్యార్హతన గురించి కేజ్రీవాల్ ఇటీవల వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఆ విషయం పక్కన పెడితే రూ.2000 నోటు రద్దు చేస్తున్నాం అని ఆర్బీఐ ప్రకటన తరువాత దేశంలో నెలకొన్న గందరగోళ పరిస్థితిపై అరవింద్ కేజ్రీవాల్ స్పందిస్తు అందుకే చదువుకున్న వ్యక్తి ప్రధాని అయితే ఇటువంటి పరిస్థితులు రావు అన్నది అంటూ ట్విట్టర్ వేదికగా కామెంట్స్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీని అందుకే చదువుకోవాలని చెబుతున్నామని అన్నారు.
నిరక్షరాస్యుడైన మోదీకి ఎవరైనా ఏమైనా చెప్పగలరా అంటూ ఎద్దేవా చేశారు. సీఎం అరవింద్ కేజ్రివాల్ ట్వీట్ చేస్తూ…2000నోటు తీసుకువస్తే అవినీతి ఆగిపోతుందని..ఇప్పుడు నోటు రద్దుతో అవినీతి అంతమయ్యిందా? అంటూ ఎద్దేవా చేస్తు ప్రశ్నించారు. అందుకే ప్రధాని చదువుకోవాలని చెబుతున్నాం. నిరక్షరాస్యుడైన ప్రధాని, ఆయనకు ఏం చెబిన అర్థం కాదు. దీంతో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.
पहले बोले 2000 का नोट लाने से भ्रष्टाचार बंद होगा। अब बोल रहे हैं 2000 का नोट बंद करने से भ्रष्टाचार ख़त्म होगा
इसीलिए हम कहते हैं, PM पढ़ा लिखा होना चाहिए। एक अनपढ़ पीएम को कोई कुछ भी बोल जाता है। उसे समझ आता नहीं है। भुगतना जनता को पड़ता है।
— Arvind Kejriwal (@ArvindKejriwal) May 19, 2023