Delhi Covid: ఢిల్లీలో తగ్గిన కరోనా కేసులు.. రోజువారీ లెక్కలు ఇవే..!
దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ ఆస్పత్రుల్లో అడ్మిషన్లు మాత్రం తక్కువగానే ఉంటున్నాయి.
- vamsi
- Published On : January 20, 2022 / 09:13 PM IST
Corona (3)
Delhi Covid: దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ ఆస్పత్రుల్లో అడ్మిషన్లు మాత్రం తక్కువగానే ఉంటున్నాయి. అయితే, బుధవారంతో పోలిస్తే దేశ రాజధాని ఢిల్లీలో కొత్త కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి.
సాయంత్రం 6.30 గంటలకు ఆరోగ్యశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో 12 వేల 306 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 43 మంది కరోనాతో మరణించారు. ఇదే సమయంలో 24గంటల్లో 18వేల 815మంది కరోనా నుంచి కోలుకున్నారు.
మహానగరంలో కరోనా ఇన్ఫెక్షన్ రేటు 21.48 శాతంగా ఉండగా.. 68 వేల 730 యాక్టీవ్ కేసులు రాష్ట్రంలో ఉన్నాయి. ఢిల్లీలో బుధవారం 13785 కేసులు నమోదయ్యాయి. ఇన్ఫెక్షన్ రేటు 23.86 శాతంగా ఉంది.
ఢిల్లీలో రోజువారీ కరోనా కేసులు:
| Date | New Cases | Deaths | Positivity Rate | Tests |
| 20 జనవరి | 12306 | 43 | 21.48% | 57290 |
| 19 జనవరి | 13785 | 35 | 23.86% | 57776 |
| 18 జనవరి | 11684 | 38 | 22.47% | 52002 |
| 17 జనవరి | 12527 | 24 | 27.99% | 44762 |
| 16 జనవరి | 18286 | 28 | 27.87% | 65621 |
| 15 జనవరి | 20718 | 30 | 30.64% | 67624 |
| 14 జనవరి | 24383 | 34 | 30.64% | 79578 |
| 13 జనవరి | 28867 | 31 | 29.21% | 98832 |
| 12 జనవరి | 27561 | 40 | 26.22% | 105102 |
| 11 జనవరి | 21259 | 23 | 25.65% | 82884 |
| 10 జనవరి | 19166 | 17 | 25% | 76670 |
| 09 జనవరి | 22751 | 17 | 23.53% | 96678 |
| 08 జనవరి | 20181 | 7 | 19.60% | 102965 |
| 07 జనవరి | 17335 | 9 | 17.73% | 97762 |
| 06 జనవరి | 15097 | 6 | 15.34% | 98434 |
| 05 జనవరి | 10665 | 8 | 11.88% | 89742 |
