Arvind Kejriwal: కేజ్రీవాల్ కుటుంబానికి ఈసీ షాక్.. కేంద్రంపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర ఆగ్రహం

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) కుటుంబానికి ఢిల్లీ ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది.

Delhi election commission ssr notice to kejriwal family aap allegations

Arvind Kejriwal: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కుటుంబానికి ఢిల్లీ ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా కేజ్రీవాల్‌తో పాటు ఆయన భార్య సునీతా కేజ్రీవాల్, కుమారుడు పుల్కిత్ కేజ్రీవాల్, తల్లిదండ్రులు గోవింద్ రామ్, గీతా దేవిలకు అధికారులు నోటీసులు జారీ చేశారు. గత ఓటర్ జాబితా రికార్డులతో వీరి ప్రస్తుత వివరాలు సరిపోలకపోవడంతో ‘అన్-మ్యాపింగ్’ కేటగిరీ కింద ధృవీకరణ కోసం ఈ చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు. న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటు హక్కు ఉన్న ఈ హై ప్రొఫైల్ కుటుంబానికి నోటీసులు రావడం ప్రస్తుతం దేశ రాజధాని రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది.

Water Tanker Rate: హైదరాబాద్‌ వాసులకు అలర్ట్.. పెరగనున్న వాటర్ ట్యాంకర్ చార్జీలు!

ఆప్ ఆగ్రహం.. కేంద్రం రాజకీయ కుట్రపై ధ్వజం:

ఈ పరిణామంపై ఆమ్ ఆద్మీ పార్టీ(Arvind Kejriwal) తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఒక నాయకుడి వివరాలు రికార్డుల్లో ఎలా తారుమారవుతాయని ప్రశ్నించింది. మోడీ ప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని తన గుప్పిట్లో పెట్టుకుని ప్రతిపక్ష నేతలను ఇబ్బందులకు గురిచేస్తోందని, రాజకీయ కుట్రలో భాగంగానే కేజ్రీవాల్ ఫ్యామిలీకి నోటీసులు ఇచ్చారని ఆరోపించింది. సర్ ప్రక్రియ పేరుతో ఢిల్లీ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఓట్లను తొలగిస్తున్నారని, ఇది ప్రజాస్వామ్యాన్ని తీవ్రంగా అణచివేయడమేనని ఆప్ నాయకులు విమర్శించారు.

క్లారిటీ ఇచ్చిన ఎన్నికల సంఘం.. పారదర్శకతపై స్పష్టత:

రాజకీయ దుమారం రేగడంతో ఢిల్లీ ఎన్నికల కమిషన్ ఈ అంశంపై అధికారిక వివరణ ఇచ్చింది. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పూర్తిగా నిబంధనల ప్రకారమే, అత్యంత పారదర్శకంగా జరుగుతోందని తెలిపింది. అర్హత కలిగిన ఏ ఒక్క నిజమైన ఓటరు కూడా తమ ఓటు హక్కును కోల్పోకుండా ఉండేందుకే ఈ సమగ్ర కసరత్తు చేస్తున్నామని పేర్కొంది. నోటీసులు అందుకున్న వారు తగిన ధృవీకరణ ఆధారాలను అధికారులకు సమర్పించి తిరిగి తమ ఓటరు నమోదును క్రమబద్ధీకరించుకోవచ్చని స్పష్టం చేసింది.